జాతీయ వార్తలు

బిహార్, యూపీల్లో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/ఘజియాబాద్, జూన్ 22: బిహార్, ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సానికి 63 మంది మృతి చెందారు. రెండు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అతలాకుతలం చేశాయి. బిహార్‌లో 57 మంది, యూపీలో ఆరుగురు మరణించారు. బిహార్‌లో 57 మంది మృతి చెందారని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. రాష్ట్రాన్ని మంగళవారం నుంచి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలవల్ల 57 మంది చనిపోగా, 24 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ (విపత్తులు) వ్యాస్‌జీ వెల్లడించారు. జిల్లాల వారీగా మృతిచెందిన వారి వివరాలు బుధవారం ఆయన తెలిపారు. పాట్నా జిల్లాలో ఆరుగురు, బక్సర్ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. నలంద, భోజ్‌పూర్, రొహ్‌తాస్, కైమూర్, ఔరంగబాద్, పూర్నియా జిల్లాల్లో నలుగురేసి చొప్పున మృతి చెందారు. కతిహార్, సహర్సా, సరన్ జిల్లాల్లో ముగ్గురేసి మృతి చెందారని వ్యాస్‌జీ పేర్కొన్నారు. భగల్‌పూర్, ముంగేర్, సమస్తిపూర్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున వర్షాలకు చనిపోయారు. బంకా, మధేపుర, ముజఫర్‌పూర్, పశ్చిమ చంపారాన్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మిగతా ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందినట్టు వార్తలందాయని ఆయన చెప్పారు. పిడుగులు పడి 24 మంది గాయపడగా, 13 పశువులు చనిపోయాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డవారికి ఎంత ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయం తీసుకోలేదని ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పష్టం చేశారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు. సంతోష్ యాదవ్ (58), బలేశ్వర్ యాదవ్ (45) హరిబల్లంపూర్, దరౌలీ గ్రామాల్లో మృతి చెందారు. కుందన్ (14), గులాబ్ యాదవ్ (62), రీనా యాదవ్ (32), జునేద్‌ఖాన్ (50) పిడుగుపడి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడ్డారని వారు చెప్పారు.
యూపీ, బిహార్, జార్ఖండ్‌లో వర్షాలకు 63 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

బిహార్‌లో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్