జాతీయ వార్తలు

ఔషధ నియంత్రణ బిల్లు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: ఔషధ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో యుపిఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకొని, దాని స్థానంలో మూలకణ పరిశోధనసహా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకొని మరో కొత్త బిల్లును తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభలో ఇప్పటికే ప్రవేశపెట్టిన డ్రగ్స్, కాస్మొటిక్స్ (సవరణ) బిల్లు, 2013ను ఉపసంహరించువాలని బుధవారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. ఈ బిల్లులోని నిబంధనలను సవరించడానికి పార్లమెంటు స్థారుూ సంఘం పలు సిఫార్సులను చేసింది.
ఔషధాలు, వైద్య పరికరాలు, మూలకణాలు, పునరుత్పత్తి మందులు, క్లినికల్ ట్రయల్స్ లాంటి వాటి నాణ్యత, సేఫ్టీ, సామర్థ్యం కాపాడడానికి 1940నాటి డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టంలో ఒక రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకురావడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఔషధ రంగం పాత్రను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మూలకణాలు, పునరుత్పత్తి ఔషధాలు, వైద్య పరికరాలు, క్లినికల్ ట్రయల్స్ లేదా పరిశోధనల్లాంటి కొత్త రంగాల్లో వస్తున్న మార్పులను ఇప్పుడున్న చట్టం సమర్థవంతంగా రెగ్యులేట్ చేయలేదు కనుక ఇప్పుడున్న చట్టంలో మరిన్ని సవరణలు చేయడం సరికాదని భావించడం జరిగిందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. అందువల్ల ‘మేక్ ఇన్ ఇండియా’లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంతోపాటుగా మన ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడమనే రెండు లక్ష్యాలతో ఇప్పుడున్న చట్టాన్ని సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటన తెలిపింది. వైద్య పరికరాలను రెగ్యులేట్ చేయడానికి ఇప్పుడున్న చట్టంకింద ప్రత్యేకంగా నిబంధనావళిని రూపొందించడం, అలాగే వైద్యపరికరాలు, ఔషధాలు, కాస్మొటిక్స్‌ను రెగ్యులేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలను తీసుకురావడం అనే రెండు స్థాయిలలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న భాగస్వాములందరితో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత వైద్య పరికరాలను రెగ్యులేట్ చేయడానికి ముసాయిదా నిబంధనలను రూపొందించి త్వరలోనే నోటిఫై చేయడం జరుగుతుందని, అలాగే కొత్త చట్టాన్ని రూపొందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని ఆ ప్రకటన తెలిపింది. వైద్య రంగానికి సంబంధించిన పరికరాలను భారీఎత్తున ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రతి ఏటా సుమారు 2 లక్షల ఓట్ల రూపాయల విలువైన పరికరాలను మన దేశంలో ఉత్పత్తి చేయడం జరుగుతోంది.