జాతీయ వార్తలు

మహారాష్టల్రో ఘోర రోడ్డు ప్రమాదం.. 17మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: మహారాష్టల్రోని ధూలే జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని సూరత్-నాగ్‌పూర్ హైవేలో ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎఎస్‌పి చంద్రకాంత్ గాల్జీ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామన్నారు.

తజకిస్థాన్, బెలారస్ అధ్యక్షులతో
మోదీ ద్వైపాక్షిక చర్చలు
తాష్కెంట్, జూన్ 24: ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో జరుగుతున్న షాంఘై సహకార మండలి(ఎస్‌సిఓ) సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తజకిస్థాన్, బెలారస్ అధ్యక్షులతో విడివిడిగా సమావేశమై ఈ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుషెంకో,మోదీ మధ్య జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించడంతో పాటుగా ఇరు దేశాల సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు.

‘్భరత్, బెలారస్ మధ్య దౌత్య సంబంధాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించారు. ఈ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకు వెళ్లాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. వాణిజ్యాన్ని ఇతర రంగాలకు విస్తరించడం, బెలారస్‌లోని పొటాష్ గనుల్లో భారత్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారం, ముఖ్యంగా యువతలోని టాలెంట్‌ను ఉపయోగించుకోవడం అంశాలు చర్చల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి’ అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.
కాగా, తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమాలి రహమాన్, మోదీ మధ్య జరిగిన చర్చల్లో ఇరు దేశాలు దౌత్య సంబంధాలు నెలకొల్పుకొని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలను దీటైన రీతిలో జరుపుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత వేగవంతం చేయడం, రెండు దేశాల మధ్య కనెక్టివిటీని, ఇప్పుడు కొనసాగుతున్న సెక్యూరిటీ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం గురించి ఇరువురు నేతలు చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జరుపుకోవడం గురించి కూడా వారు చర్చించారని వికాస్ స్వరూప్ తెలిపారు.