జాతీయ వార్తలు

బ్రెగ్జిట్ తరహాలో ఢిల్లీలో రిఫరెండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా, వైదొలగాలా అనే అం శంపై బ్రిటన్‌లో నిర్వహించిన బ్రెగ్జిట్ తరహా ప్రజాభిప్రాయ సేకరణను ఢిల్లీలోనూ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బ్రెగ్జిట్ ఫలితాలు శుక్రవారం వెల్లడైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. యుకె రిఫరెండం తర్వాత ఢిల్లీలో కూడా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ రాష్ట్ర హోదా కోసం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలను సంక్రమింపజేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దృఢనిశ్చయంతో ఉంది. ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడం, విధానపరమైన నిర్ణయాలన్నీ కేంద్రం అధీనంలో ఉండటంతో ఢిల్లీ రాష్ట్ర హోదాను సాధిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇవ్వడంతో ఓటర్లు ఆప్‌కు పట్టం కట్టారు. పాలనలో కేంద్ర ప్రభుత్వ జోక్యం, లెఫ్టినెంట్ గవర్నర్‌తో తరచూ ఘర్షణ స్థాయి వాతావరణం నెలకొంటున్న విషయం విదితమే. పలు కీలక నియామకాల్లో సైతం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య విభేదాలు సర్వసాధారణమై పోయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్ర హోదాను సాధించేందుకు బ్రెగ్జిట్ తరహాలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.