జాతీయ వార్తలు

డ్రగ్స్ నిరోధానికి సమష్టి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ఉగ్రవాదం, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. దేశ సామాజిక జీవనంపై పెను ప్రభావం చూపుతున్న వీటి నిరోధానికి సమష్టి పోరాటం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంతో విలువలు నశించిపోయి నేరాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఈ దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు, ఎన్జీఓ సంస్థలు, పౌర సమాజ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని ప్రణబ్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణా నిరోధక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగించారు. మాదక ద్రవ్యాలు, మద్యపాన నిరోధించేందుకు విశేషంగా సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఎక్కడినుంచి నిధులు అందుతున్నాయని ప్రశ్నించిన ఆయన, ఉగ్రవాదం, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు ఒకదానికొకటి అనుసంధానం కావడం వల్లే ఉగ్ర కార్యకలాపాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందుతున్నాయని చాలా నివేదికలు స్పష్టం చేసిన విషయాన్ని ప్రణబ్ గుర్తుచేశారు. ఈ మూడింటిని ఏకకాలంలో నిరోధించడం కష్టసాధ్యమనీ, వీటి బంధాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడే సత్ఫలితాలను ఇస్తుందని ఆయన సూచించారు. మన దేశంతో పాటు యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఈ మూడింటిని సమూలంగా నిర్మూలించేందుకు సమష్టి కృషితో పాటు, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరముందని కూడా ప్రణబ్ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తుల సమస్య కాదని, యావత్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సమాజంలో విలువలు తగ్గిపోయి నేరాలు, హింసాత్మక ధోరణి పెరిగిపోతుందని, వీటి నిరోధానికి సమష్టి కృషితో పాటు ప్రజా చైతన్యం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. సమాజంలో మద్యపానం, మాదక ద్రవ్యాల నిరోధానికి కృషిచేసినందుకు అవార్డు గ్రహీతలను ప్రణబ్ ఈ సందర్భంగా అభినందించారు. సమాజ శ్రేయస్సు దృష్టి ఈ కృషిని కొనసాగించాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తవార్‌చంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.
chitram...
మాదక ద్రవ్యాల నిరోధానికి, వాటి బారిన పడినవారికి పునరావాసం కల్పించడంలో
విశేష కృషిచేస్తున్న మణిపూర్ సంస్థకు అవార్డును అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్