జాతీయ వార్తలు

నలుగురు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు కొత్త సభ్యులు మంగళవారం పార్లమెంటు ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. టిడిపి మద్దతుతో రాజ్యసభకు ఎంపికైన బిజెపి సీనియర్ నాయకుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి, టిఆర్‌ఎస్ సభ్యులు డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో అన్సారీ ప్రమాణం చేయించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు, సహాయ మంత్రి నఖ్వీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టిడిపినుంచి మరోసారి ఎంపికైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కొత్త సభ్యుడు టిజి వెంకటేశ్ ప్రమాణ స్వీకారం చేయలేదు. రాజ్యసభలో వారిరువురు ప్రమాణం చేస్తారు. జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.
ఫిరాయింపుల చట్టం సవరించాలి
ఫిరాయింపుల చట్టం సవరించేలా కృషి చేస్తానని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీ ఫిరాయంపులను నిరోధించే లక్ష్యంకోసం పని చేస్తానని, రాజ్యసభ సభ్యత్వాన్ని అలంకారప్రాయంగా భావించటం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వారి సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఫిరాయింపుల చట్టం గురించి ప్రస్తావించటంతోపాటు దానికి సవరణలు ప్రతిపాదిస్తానని ఆయన ప్రకటించారు.
కేంద్రం సహకరించటం లేదు: డిఎస్
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ, సహకారాలు అందడం లేదని రాజ్యసభ కొత్త సభ్యుడు డి శ్రీనివాస్ విమర్శించారు. తనను రాజ్యసభకు పంపించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని డిఎస్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో టిఆర్‌ఎస్ చేరుతుందా లేదా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని డిఎస్ తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తానని మరో టిఆర్‌ఎస్ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు తెలిపారు.

చిత్రం... రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీతో కరచాలనం చేస్తున్న సురేష్ ప్రభు, డి.శ్రీనివాస్, లక్ష్మీకాంతారావు, విజయసాయిరెడ్డి