జాతీయ వార్తలు

గుప్తాకు ఉద్వాసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 28: తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తాను తొలగించినట్లు తెలిసింది. కృష్ణా బోర్డు బాధ్యతలను తాత్కాలికంగా గోదావరి నదీ జలాల యాజమాన్యం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి అప్పగించినట్లు చెబుతున్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ తయారు చేయటం ద్వారా గుప్తా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల చిచ్చు పెట్టటం తెలిసిందే. గుప్తా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండానే అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే విధంగా నోటిఫికేషన్ తయారు చేసి తమకు పంపించారని ఉమా భారతి భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే గుప్తాకు ఉద్వాసన పలికారని చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా కృష్ణా బోర్డు కార్యదర్శి గుప్తా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు ఉమాభారతికి ఫిర్యాదు చేయటం తెలిసిందే. గుప్తా ఏపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉమాభారతి భావించినట్లు చెబుతున్నారు. హరీష్ రావు ఫిర్యాదు చేసిన అనంతరం ఉమాభారతి ఈ అంశంపై సీనియర్ అధికారుల చేత దర్యాప్తు చేయించగా గుప్తా ఏకపక్షంగా వ్యవహరించటంతోపాటు ఏపికి అనుకూలంగా వ్యవహరించినట్లు తేలడంతో ఉమాభారతి ఆయనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు జరపకుండా వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురావటం సాధ్యం కాదంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనతో ఉమాభారతి ఏకీభవించినట్లు కేంద్ర జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమా భారతి తమ శాఖ సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం కృష్ణా బోర్డుకు కొత్త కార్యదర్శిని నియమిస్తారని అంటున్నారు.