జాతీయ వార్తలు

నేడు కొత్త క్షిపణి తొలి ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసోర్ (ఒడిశా), జూన్ 28: మన దేశం ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూతలంనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల కొత్త క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి తొలిసారిగా పరీక్షనున్నారు. ‘ఈ తొలి పరీక్షకు సన్నాహాలన్నీ తుది దశకు చేరుకున్నాయి. వాతావరణం గనుక అనుకూలిస్తే బుధవారం చాందీపూర్ ఐటిఆర్‌నుంచి ఈ పరీక్షను నిర్వహిస్తాం’ అని చాందీపూర్ ఐటిఆర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ క్షిపణిని భారత్, ఇజ్రాయెల్ జాయింట్‌వెంచర్ అభివృద్ధి చేసిందని డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. క్షిపణి కాకుండా ఈ వ్యవస్థలో క్షిపణిని, దాని గమన మార్గాన్ని గుర్తించడానికి, నిర్దేశించడానికి వీలుగా మల్టీ ఫంక్షనల్ సర్వియలెన్స్, త్రెట్ అలర్ట్ రాడార్ (ఎంఎఫ్ స్టార్) కూడా ఉంటుంది. భారత రక్షణ సిబ్బంది, డిఆర్‌డిఓ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌కు చెందిన అధికారులు సంయుక్తంగా ఈ క్షిపణి పరీక్ష ప్రయోగాన్ని నిర్వహిస్తారు.
ఋందు జాగ్రత్త చర్యగా పరీక్ష జరిపే సమయంలో ఐటిఆర్‌లోని మూడో లాంచ్‌పాడ్‌కు 2.5 కిలోమీటర్ల పరిధిలోని 3,562 మంది గ్రామస్థులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. పరీక్ష జరిగే సమయంలో దగ్గర్లో అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లోకి వెళ్లాలని ఈ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలను మంగళవారం మైక్‌లలో అప్రమత్తం చేయడం జరిగిందని, అలాగే ఆ సమయంలో సమద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించామని జిల్లా రెవిన్యూ అధికారి ఒకరు చెప్పారు.