జాతీయ వార్తలు

రెండున్న గంటలపాటు రక్తపుమడుగులోనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 28: దాదాపురెండున్నర గంటలపాటు తమ కుమార్తె రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్నా ఆమెను ఎవరూ పట్టించుకోలేదని దారుణ హత్యకు గురైన ఐటి ఉద్యోగిని స్వాతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంగంబాకం స్టేషన్ వద్ద నడిరోడ్డుపై ఈ దారుణ హత్య జరిగినా కూడా ప్రతి ఒక్కరూ వౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈకేసును చెన్నై పోలీసులకు బదిలీ చేసిన నేపథ్యంలో హంతకుడిని కచ్చితంగా పట్టుకోగలని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క బిజెపి రాష్ట్ర విభాగం కూడా ఈ కేసులో స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగానే విచారించి, దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే స్వాతి ప్రాణాలు పోయాయని కనీసం ఎవరో ఒకరు అంబులెన్స్‌ను పిలిచినా పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించడంతోపాటు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దాంతో కేసు దర్యాప్తును రైల్వే పోలీసుల నుంచి నగర పోలీసులకు ప్రభుత్వం బదిలీ చేసింది.