జాతీయ వార్తలు

చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్‌కి స్వలింగ సంపర్కుల పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 377 సెక్షన్‌ను కొట్టివేయాలని కోరుతూ స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న కొంతమంది ప్రముఖులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని విచారిస్తున్న బెంచ్‌కి నివేదించింది. తగు ఆదేశాలు జారీ చేయడానికి ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌కి నివేదించాలని న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, అశోక్ భూషణ్‌లతో కూపిన బెంచ్ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్యూరేటివ్ పిటిషన్‌తో జతచేయాలని విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ అరవింద్ దతర్ అన్నారు. దీంతో బెంచ్ ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని ప్రకటించింది. లైంగిక హక్కు జీవించే హక్కులో ఒక భాగమని, అందువల్ల తమ లైంగిక హక్కులను కాపాడాలంటూ ప్రముఖ చెఫ్ రితు దాల్మియా, హోటల్ యజమాని అమన్‌నాథ్, డ్యాన్సర్ ఎన్ జోహర్ తదితర ప్రముఖులు తమ పిటిషన్‌లో కోరారు.

వాట్సాప్ రద్దు
పిటిషన్ కొట్టివేత!

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను నడిపిస్తున్న వాట్సాప్ సహా ఇతర అప్లికేషన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. భద్రతాకారణాలు దృష్ట్యా వీటిని నిషేధించాలని, అలాగే ఇవేవీ కూడా దేశ చట్టాలకు అనుగుణంగా పనిచేయడం లేదంటూ పిటిషనర్ వాదించారు. ప్రధాన న్యాయమూర్తి పిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఖాన్‌విల్కర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసరం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వీటిపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంలోని సంబంధిత వర్గాలను ఆశ్రయించే అవకాశాన్ని పిటిషనర్‌కు కల్పించింది. సుధీర్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. వాట్సప్ సహా అనేక మెసేజింగ్ ప్రక్రియలు భారత్ టెలిగ్రాఫ్ చట్టం, సమాచార చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన తెలిపారు.

11నుంచి రైల్వే సమ్మె

న్యూఢిల్లీ, జూన్ 29: రైల్వే ఉద్యోగులు ముందు నిర్ణయించిన ప్రకారం జూలై 11 తేదీ నుండి సమ్మెలోకి వెళతారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాఘవయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీస వేతనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన తెలిపారు. కనీస వేతనాన్ని పెంచటంలో న్యాయం ఉన్నా ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయిందని రాఘవయ్య విమర్శించారు. మల్టిప్లయర్ ఫ్యాక్టర్‌ను కావలసిన మేర సవరించలేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది కాబట్టే రైల్వే ఉద్యోగులు జూలై 11న ఉదయం ఆరు గంటల నుండి సమ్మె ప్రారంభిస్తారని రాఘవయ్య ప్రకటించారు. సమ్మె పోరాటం ప్రారంభించేందుకు రైల్వే ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సంఘం ప్రెస్ కార్యదర్శి ఎస్.ఎన్.మాలిక్ ఇదే ప్రకటనలో పిలుపు ఇచ్చారు.
అలాగే హైక్ వైబర్ సిగ్నల్ సెక్యూర్‌చార్ట్ వంటివి కూడా భద్రతాపరంగా సమస్యలు తెచ్చిపెట్టేవేనని పిటిషనర్ వెల్లడించారు.

న్యాయవాదుల సమస్య పరిష్కరించండి
కేంద్ర మంత్రికి తెలంగాణ కాంగ్రెస్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్ 29: తెలంగాణ న్యాయవాదులు రోడ్లపైకి రావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కారణమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపులవల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలసి విజ్ఞప్తి చేశారు. సదానందను కలిసినవారిలో రాపోలు అనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. అనంతరం షబ్బీర్ అలీ విలేఖరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హైకోర్టు విభజన అంశంలో నాటకీయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్‌తో మాట్లాడానని, అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు తెరాస ఎంపీలు మద్దతివ్వకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి హైకోర్టు విభజనకు కృషిచేయాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ జూలై 18న విచారణ రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు ఎంపీలు, 25మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ తరపున సుప్రీం కోర్టులో సినియర్ న్యాయవాదులు వివేక్ టాంక, కపిల్ సిబాల్ వాదనలు వినిపించనున్నట్లు షబ్బీర్ అలీ చెప్పారు.