జాతీయ వార్తలు

దేశం విడిచివెళ్లే ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 25: దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులపై సోమవారం ఢిల్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు. అయితే తనకు కాని, తన భార్య కిరణ్ రావుకు కాని భారతదేశాన్ని విడిచివెళ్లాలన్న ఆలోచన లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దేశంలో గత కొంత కాలంగా అసహన ధోరణులు నెలకొన్నాయంటూ సోమవారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేసిన అమీర్ ఖాన్‌పై బిజెపితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ఒక వర్గం విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 50ఏళ్ల అమీర్ ఖాన్ బుధవారం ఇక్కడ ‘నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను’ అని ప్రకటించారు. ‘తొలుత నన్ను ఒక విషయం స్పష్టం చేయినివ్వండి. నాకు లేదా నా భార్య కిరణ్‌కు ఈ దేశం విడిచి వెళ్లాలన్న ఆలోచన లేదు. గతంలో ఎప్పుడూ దేశం విడిచి వెళ్లలేదు. భవిష్యత్తులోనూ వెళ్లబోము’ అని అమీర్ తేల్చి చెప్పారు. సోమవారం నాటి తన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వారు తన ఇంటర్వ్యూను సరిగా చూసి ఉండరని, లేదా ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘్భరత్ నా దేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారత్‌లో పుట్టడం, ఇక్కడే జీవిస్తుండటం అదృష్టంగా నేను భావిస్తున్నాను’ అని అమీర్ పేర్కొన్నారు. అమీర్ ఖాన్ ముఖంలో తనపై వచ్చిన విమర్శలకు భయపడుతున్న ఛాయలు ఏమాత్రం కనిపించలేదు. ‘నేను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. నన్ను దేశద్రోహిగా పిలుస్తున్న వారందరికీ నేను ఒకటి చెప్పదలచుకున్నాను. భారతీయుడిని అయినందుకు నేను గర్విస్తున్నాను. దీనికి ఎవరి అనుమతి కాని ఆమోదం కాని నాకు అక్కర లేదు’ అని అమీర్ ఖాన్ అన్నారు.
మూడు రోజులు ముంబయిలో ఉండొద్దు
న్యూఢిల్లీ: ఇదిలా ఉండగా, తన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొద్ది రోజులు పిల్లలను తీసుకొని ముంబయి వీడి వెళ్లాల్సిందిగా అమీర్ ఖాన్ తన భార్య కిరణ్‌ను కోరినట్లు సమాచారం. భార్య కిరణ్ భద్రత గురించి అమీర్ ఆందోళన చెందుతున్నారని, అందువల్ల పిల్లలను తీసుకొని రెండు మూడు రోజులు ముంబయి వదలి వెళ్లాల్సిందిగా ఆమెను కోరారని ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పినట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది.