జాతీయ వార్తలు

కొత్త ఎంపీల్లో 55మంది కోటీశ్వరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: రాజ్యసభకు కొత్తగా ఎంపికయిన 57 మంది ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు. 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఎంపీల్లో ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 252 కోట్లు. కాంగ్రెస్‌కు చెందిన కపిల్ సిబల్ (రూ.212 కోట్లు), బిఎస్పీకి చెందిన సతీశ్ చంద్ర మిశ్రా(రూ. 193 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, రాజ్యసభకు కొత్తగా ఎంపికయిన ఎంపీల్లో అతి తక్కువ ఆస్తులున్న వారిలో బిజెపికి చెందిన అనిల్ మాధవ్ దవే (రూ .60 లక్షలు), రామ్ కుమార్ (రూ.86 లక్షలు) ఉన్నారు. కోటీశ్వరులైన 55 మంది ఎంపీల్లో బిజెపికి చెందిన వారు 15 మంది ఉన్నారు. కాగా, తమకు కోటికి పైగా అప్పులున్నట్లు ప్రకటించిన ఎంపీలు 19 మంది ఉన్నారు. బిఎస్పీకి చెందిన సతీశ్ చంద్ర మిశ్రాకు రూ.193 కోట్ల ఆస్తులుంటే అప్పులు 38 కోట్లున్నాయి.
కాగా, కొత్తగా ఎన్నికయిన 57 మంది రాజ్యసభ సభ్యుల్లో క్రిమినల్ కేసులున్న వారు 13 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురిపై హత్యాయత్నం, చీటింగ్‌లాంటి తీవ్రమైన నేరారోపణలున్నాయి.క్రిమినల్ కేసులున్న వారిలో బిజెపికి చెందిన వారు ముగ్గురు, సమాజ్‌వాది పార్టీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్, బిజెడి, మిఎస్పీ, ఆర్‌జెడి,డిఎంకె, ఎస్‌హెచ్‌ఎస్, వైకాపాలకు చెందినవారు ఒక్కొక్కరున్నారు. ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌ల ఆధారంగా ఆ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.