జాతీయ వార్తలు

ఏపి, తెలంగాణకు విడివిడిగా గ్రూప్-1 పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: 2011 గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఈప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్,జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. 2011గ్రూప్ -1 పరీక్ష వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్త సిలబస్‌తో తామే పరీక్షలు నిర్వహించుకుంటామని ఏపిపిఎస్సీ, టిఎస్‌పిఎస్సీల తరఫున న్యాయవాదులు దుష్యంత్‌దవే, గిరి,వివిఎస్ రావు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
రెండు రాష్ట్రాల వాదనలతో విభేదించిన ధర్మాసనం పాత సిలబస్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. 2011లో నిర్వహించిన పరీక్ష ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు మినహాయింపునిస్తూ వారి ఫలితాలు ప్రకటించాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. 2011 సంవత్సరంలో ఏపిపిఎస్సీ 312 ఖాళీలను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహించింది. 16,782 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. 606 మంది ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేశారు. ఈ సమయంలో ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో ఆరు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమస్యను పరిష్కారం చూపాలంటూ హైకోర్టు యుపిఎస్‌సికు సిఫార్సు చేసింది.
కాగా హైకోర్టు ఆదేశాలపై ఏపిపిఏస్‌సి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని 2013లో ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదంటూ చిమటి శ్రీనివాస్ అనే అభ్యర్థి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. ఇంటర్వ్యూలకు సైతం హాజరైన అభ్యర్థులు కోటేశ్వర్‌రావు, శైలజ అందులో ఇంటీరిమ్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం రెండు రాష్ట్రాలు పాత సిలబస్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించాలని ప్రక్రియ మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని తీర్పు వెలువరించింది.