జాతీయ వార్తలు

ఆ చెక్‌డ్యామ్ ఎత్తును 5 అడుగులకు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 1: అంతర్ రాష్ట్ర పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలోని పెరుంబల్లం గ్రామం వద్ద నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ఎత్తును అయిదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడాన్ని నిరసిస్తూ ఆమె ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. మద్రాస్-మైసూర్ ఒప్పందం- 1892 ప్రకారం ఇది అంతర్ రాష్ట్ర నది అని పేర్కొంటూ, దిగువ రాష్టమ్రైన తమిళనాడు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఎగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ఈ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అందువల్ల వెంటనే జోక్యం చేసుకొని పాలార్ నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ ఎత్తును 12 అడుగుల నుంచి తిరిగి అయిదు అడుగులకు తగ్గించేలా అధికారులను ఆదేశించాలని జయలలిత ఆ లేఖలో చంద్రబాబును కోరారు. ఈ విషయంలో చంద్రబాబు వెంటనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. మద్రాస్-మైసూరు ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ పాలార్ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిరోధించాలని కోరుతూ తమిళనాడు 2006 ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు జయలలిత గుర్తు చేశారు. ఈ చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల తమిళనాడు రైతులు, ఇతర ప్రజానీకం సాగు, తాగునీటి పరంగా తీవ్రంగా నష్టపోతారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.