జాతీయ వార్తలు

ఆదుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1:ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి శుక్రవారం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కేంద్రమంత్రి సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టం అమల్లోకి వచ్చాక రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోం శాఖదేనని ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సుజనా చౌదరి పేర్కొన్నారు. చైనా పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వివరాలను అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి వివరించారని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నీతీ ఆయోగ్ ద్వారా రూ.2500 కోట్లు ఇవ్వాలని సూచించిందన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు సంవత్సరానికి రూ.350 కోట్లు చొప్పున ఆరేళ్లు కేటాయించారని సుజనా పేర్కొన్నారు. ఏపీ భవన్ సహా విభజన చట్టంలోని సెక్షన్ 9,10 లోని సంస్థలన్నిటినీ చట్ట ప్రకారమే విభజించాలని కేంద్రానికి తేల్చి చెప్పామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరినట్టు సుజనా వెల్లడించారు. హైకోర్టు విభజనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న ఆరోపణలను సుజనా చౌదరి తోసిపుచ్చారు. హైకోర్టు నిర్మాణానికి అమరావతిలో స్థలం కేటాయించామని, కేంద్ర బృందం సైతం పరిశీలించి వెళ్లిందని గుర్తుచేశారు. హైకోర్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అనారోగ్యంతో ఉన్నందున ఆమెను ముఖ్యమంత్రి పరామర్శించారని, జలవనరులపై చర్చించలేదని సుజనాచౌదరి చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో మరో స్థానం టీడీపీకి వస్తే సంతోషమన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకొన్న చంద్రబాబు ఉదయం ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ జన్మదిన వేడకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీభవన్‌లో ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు హరిబాబు, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థనాథ్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్టస్థ్రాయిలో భాజపా-తెదేపా నేతల మధ్య దూరం పెరుగుతోందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కృష్ణా పుష్కరాల కోసం రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న దేవాలయాల తొలిగింపు అంశంపై సిఎంతో చర్చించినట్టు హరిబాబు చెప్పారు. తొలిగించిన దేవాలయాలను మరిన్ని నిధులతో అభివృద్ది చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు.
chitram...
అరుణ్‌జైట్లీకి జ్ఞాపిక అందజేస్తున్న సిఎం చంద్రబాబు