జాతీయ వార్తలు

నీట్‌పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: నీట్ నిర్వహణను ఈ సంవత్సరానికి మినహాయింపునిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై 7కి వాయిదా వేసింది. ప్రముఖ సామాజిక వేత్త ఆనంద్ రే, సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్‌లు ఈ అర్టినెన్సును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సోమవారం ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. సంకల్ప్ చారిటబుల్ ట్రస్టు తరపున పిటిషన్ దాఖలు చేసిన అమరేంద్ర శరణ్ గతంలో ఈ కేసు విచారించిన జస్టిస్ అనిల్.ఆర్.దవే ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం జూలై 7న జస్టిస్ దవే ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు. వైద్యవిద్యా ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో కేంద్రం తన వైఖరిని తరచూ మార్చుకోవడం సెక్షన్ 14 ప్రకారం సమానత్వపు హక్కు, సెక్షన్ 21 ప్రకారం జీవించే హక్కులను ఉల్లంఘించినట్లేనని దీని వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ సరైనదేనంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి.