జాతీయ వార్తలు

గుర్గావ్‌లో తారుషి అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌లో ఉగ్రవాదులచే హత్యకు గురైన యువతి తారిషీ జైన్ మృతదేహాన్ని న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యుసి బర్కిలీ విద్యార్థిని అయిన తారిషీ సెలవులను గడిపేందుకు ఢాకా వెళ్లింది. తారిషీ తండ్రి దాదాపు రెండు దశాబ్దాల నుంచి బంగ్లాదేశ్‌లో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. కాగా, సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్న తారిషీ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు డిఎల్‌ఎఫ్ ఫేజ్-1 కమ్యూనిటీ సెంటర్‌లో ఉంచారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్, హర్యానా మంత్రి రామ్ విలాస్ శర్మ, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ తదితరులు తారిషీకి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత తారిషీ మృతదేహంతో గుర్గావ్‌కు బయలుదేరిన ఆమె తల్లిదండ్రుల వెంట పియూష్ గోయల్ కూడా వెళ్లారు. గుర్గావ్‌లోని ఇఫ్కో చౌక్ శ్మశాన వాటికలో తారిషీ మృతదేహానికి ఆమె సోదరుడు సాంచిత్ అంత్యక్రియలు నిర్వహించాడు.

ఢిల్లీకి చేరిన తారుషి భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

విలపిస్తున్న తారుషి బంధువులు

వికారంగా ఉన్నానంది..
ఇన్ఫోసిస్ టెకీ హత్య కేసులో
నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు
చెన్నై, జూలై 4: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఎస్.స్వాతిని హత్య చేసింది తానేనని ఈ కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు పి.రామ్‌కుమార్ నేరాన్ని అంగీకరించాడు. అందవిహీనంగా ఉన్నానంటూ స్వాతి తనను దూషించేదని, అందుకే ఆమెపై కసితో ఈ దారుణానికి పాల్పడ్డానని స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల ద్వారా కలుసుకున్న తామిద్దరం ఫోన్ నెంబర్లను కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నామని చెప్పాడు. హతురాలికి రామ్‌కుమార్ ముందునుంచే తెలిసినప్పటికీ స్వాతి అతడిని ప్రోత్సహించేది కాదని, పలు సందర్భాల్లో ఆమె రామ్‌కుమార్ ప్రేమను తిరస్కరించిందని, దీంతో స్వాతిని వేధించడం మొదలుపెట్టిన రామ్‌కుమార్ చూలైమేడులోని ఒక భవనంలోకి మకాం మార్చి ఆమె కదలికలను గమనిస్తూ వచ్చాడని, పథకం పన్ని ఆమెపై దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అయితే అది స్వాతి ప్రాణం మీదికి వస్తుందన్న విషయం అతనికి సరిగా తెలియదని ఆ అధికారి చెప్పారు.

ఖైదీల విడుదల కేసు
విచారణ వాయిదా
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 4: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఖైదీల విడుదల కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007లో ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007 సంవత్సరానికి సిపాయిల తిరుగుబాటు జరిగి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసేందుకు రెండు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలో గౌరు వెంకటరెడ్డి, మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి, చార్మినార్ వద్ద పేలుళ్ల కుట్ర పన్నిన నరుూమ్ తదితరులున్నారు. ఖైదీల విడుదలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఖరారు చేసిన విధివిధానాలు లోపాభూయిష్టంగా ఉన్నాయని పిటిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాగ్దాద్ పేలుళ్లలో
200 దాటిన మృతులు
బాగ్దాద్, జూలై 4: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 213కు పెరిగింది. కరాద్ జిల్లాలో జనసమ్మర్థం కలిగిన షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా దండిస్తామని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్-అబాది పేర్కొన్న ఆయన, మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు. అలాగే కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఫల్లూజా పట్టణం నుంచి ఐసిస్ ఉగ్రవాదులను వెళ్లగొట్టి ఇరాకీ దళాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వారం రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. గత వారం అమెరికా-ఇరాకీ సంయుక్త విమాన దాడుల్లో ఫల్లూజాలోని ఉగ్రవాదుల స్థావరాలు దాదాపు నాశనమైన విషయం తెలిసిందే.

పట్టాలపై చెత్తవేస్తే
కఠిన చర్యలు
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 4: రైల్‌పట్టాలకు ఇరువైపులా చెత్తాచెదారం వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సోమవారం ఆదేశించింది. ఇలాంటి వారిపై ఐదువేల రూపాయల జరిమానా విధించాలని, అలాగే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. రైల్వేట్రాక్‌లకు ఇరువైపులు గుడిసెలు, అలాగే శాశ్వత భవనాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ట్రిబ్యునల్ అసలు ఇలాంటి నిర్మాణాలకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది. అంతేకాకుండా వీటి ద్వారానే రైల్వే ట్రాక్‌లన్నీ చెత్తతో నిండిపోతున్నాయని కూడా వెల్లడించింది. ఇక్కడ నివసిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రైల్వేట్రాక్‌ల వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని సూచించింది. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి సబ్జిమండీ స్టేషన్ వరకూ ఉన్న అనేక భవనాల్లో నివసిస్తున్నవారే రోజువారీగా చెత్త వేస్తున్నారని పేర్కొంది.