జాతీయ వార్తలు

మైత్రీ బంధంలో నవశకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో ఐదు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ 7వ తేదీ నుంచి పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్లు, తీరప్రాంత పరిరక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయంలో సహకారం వంటి కీలక అంశాలపై ఈ నాలుగు దేశాలతో మోదీ విస్తృత స్థాయిలో చర్చిస్తారు. అనేక ఆఫ్రికాదేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్యపరంగా సత్సంబంధాలను విస్తరించుకోడానికి ఈ నాలుగుదేశాలతో బలమైన మైత్రీ బంధం అత్యంత కీలకం. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ఆఫ్రికా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఆఫ్రికా ఖండంలోని దేశాలు అన్నింటితోనూ చైనా మైత్రీబంధాన్ని బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌కూడా ఆ దిశగా అడుగులు వేయడం వ్యూహాత్మక పరిణామమేనని నిపుణులు అంటున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన కొన్ని వారాల వ్యవధిలోనే మోదీ ఈ పర్యటన చేపట్టడం అత్యంత కీలక పరిణామంగా విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఐదు రోజుల పర్యటనలో ఆఫ్రికా దేశాలతో మోదీ అనేక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వశాఖలో ఆర్థిక సంబంధాల కార్యదర్శి అమర్‌సిన్హా తెలిపారు. ఆఫ్రికా నుంచే భారత్ భారీ పరిమాణంలో పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకుంటోంది. మొజాంబిక్‌తో దీర్ఘకాల ఒప్పందాన్ని కుదర్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంటే ఏటా లక్ష టన్నులమేర పప్పు్ధన్యాల దిగుమతికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. దేశంలో ఇటీవల కాలంలో పప్పుల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఒప్పందానికి అవకాశం ఉండడం కూడా ప్రాధాన్యత అంశమే. ఇందులో భాగంగా మొజాంబిక్‌లోని రైతులందరికీ భారతదేశం విత్తనాలు, టెక్నాలజీని అందిస్తుంది. వారు పండించే పప్పుదినుసులను భారత్ ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా దిగుమతి చేసుకుంటారు. ఆస్ట్రేలియా, ఖతార్ తరువాత హైడ్రోకార్బన్ రంగంలో మూడో అతిపెద్ద ఎగుమతి దేశంగా ఉన్న మొజాంబిక్‌తో ఇందుకు సంబంధించి కూడా ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓఎన్‌జిసిసహా అనేక భారత కంపెనీలు మొజాంబిక్ హైడ్రోకార్బన్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. తన తొలి పర్యటన మొజాంబిక్‌తోనే మొదలవుతుంది కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు నియూసీతో 7న మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 8, 9 తేదీల్లో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తారు. 10న టాంజానియాలోనూ, చివరిగా కెన్యాలోనూ ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. అలాగే ఈ నాలుగుదేశాల్లో కూడా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అత్యధికంగా ఉన్న జొహెనె్నస్‌బర్గ్, నైరోబిలో ఈ సమావేశాలను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత, ఆఫ్రికా ఫోరం సమ్మిట్ సదస్సు ప్రయోజనాలను సంఘటించం చేసుకోవాలన్న ధ్యేయంగా పనిచేస్తున్నామని సిన్హా వెల్లడించారు.

చిత్రం... రియోలో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పయనమవుతున్న క్రీడాకారులకు శుభాభినందనలు తెలిపేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ