జాతీయ వార్తలు

మళ్లీ హరిబాబేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 8: ఆంధ్ర ప్రదేశ్ బిజెపికి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధినాయకత్వం మల్లాగుల్లాలు పడుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబునే కొనసాగించాలని పార్టీలోని ఓ బలమైన పక్షం గట్టిగా వాదిస్తుంటే మరో వర్గం మాత్రం విధాన మండలి సభ్యుడు సోము వీర్రాజును నియమించాలని పట్టుపడుతోంది. దీనితో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడిండదనేమాట వినిపిస్తోంది.అమిత్ షా శుక్రవారం రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులతో సమావేశమై పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మిత్రపక్షమైన తెలుగుదేశం అధికారంలో ఉన్నందున ఆ పార్టీతో కలిసి,మెలిసి వ్యవహరించే వారికే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలే తప్ప దాన్ని వ్యతిరేకించే వారికి కాదని ఒక వర్గం వాదించింది. అయితే టిడిపి ప్రభుత్వం తప్పులను ప్రజల ముందు పెట్టటం ద్వారా పార్టీని ప్రజల వద్దకు తీసుకుపోయే వారికే నాయకత్వాన్ని అప్పగించాలని మరోవర్గం సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రస్తుత అధ్యక్షుడు కె.హరిబాబు అభ్యర్థిత్వాన్ని బలమపరిచారని అంటున్నారు. ఆయనే్న రాష్ట్ర పార్టీ సారధిగా కొనసాగించాలని పలువురు నాయకులు అధినాయకత్వంపై వత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. అందుకే కొత్త అధ్యక్షుడి ఎంపికపై అమిత్ షా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. తెలంగాణ బిజెపి శాఖ అధ్యక్షుడుగా శాసన సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌ను నియమించినప్పుడే ఆంధ్ర ప్రదేశ్ బిజెపికి కూడా హరిబాబు స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారని భావించారు. అయితే హరిబాబునే కొనసాగించాలనే వర్గం గట్టిగా వత్తిడి తీసుకురాటంతో కొత్త అధ్యక్షుడి నియామకం జరగలేదు.