జాతీయ వార్తలు

హైకోర్టులో తేల్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర, రాష్ట్రాల వివాదాల విషయంలో ముందుగా హైకోర్టు విచారణ జరపాలా లేక దీన్ని సుప్రీం కోర్టే విచారించాలా అన్న అంశంపై కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. రాజ్యాంగంలోని 239 ఏయే అధికరణ కింద తమ అధికారాల పరిధి ఏమిటో తేల్చాలని ఈ పిటిషన్‌లో ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. ముందుగా అన్ని ప్రాధమిక అంశాలను అలాగే వివాదానికి సంబంధించిన అధికార పరిధి విషయంలోనూ హైకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాతే తమ వద్దకు రావాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ రూలింగ్ ఇచ్చింది. అధికార పరిధి సహా అన్ని అంశాలపైనా ముందుకు హైకోర్టును ఆశ్రయించిన తరువాతే తమ వద్దకు రావాలని బెంచ్ తేల్చిచెప్పింది. హైకోర్టు అన్నది కూడా రాజ్యాంగ కోర్టుఅని ఈ తరహా రాజ్యాంగ పరమైన అంశాలను అన్వయించి నిర్ణయించే అధికారం దానికి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీకి ఉన్న అధికారాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వివరించారు. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దీని అధికారాల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పే కీలకమని, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకే పనిచేయాలన్న విషయాన్ని సుప్రీం కోర్టే తేల్చాల్సి ఉంటుందని ఇందిరాజైసింగ్ స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని ప్రత్యేకంగా సుప్రీం కోర్టు మాత్రమే విచారించాలని వెల్లడించారు.

కేజ్రీవాల్‌కు బెయిల్
బిజెపికి చెందిన ఎంపీ రమేష్ బిదూరి దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడిగా పిలిచి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్విందర్ సింగ్ విచారించారు. అనంతరం 10వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కేజ్రీవాల్ తన పరువుతీశారని బిదూరి పిటిషన్ వేశారు. తనపై ఎన్నోకేసులు ఉన్నాయని ఆ ఇంటర్‌వ్యూలో కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్ని కేసులున్నాకూడా ఢిల్లీ పోలీసులు తనపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని కూడా సిఎం చెప్పడం తీవ్ర మనస్తాపం కలిగించిందని బిదూరి అన్నారు. తనపై ఏ విధమైన కేసు లేకపోయినా కేజ్రీవాల్ తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకే పరువునష్టం కేసు వేసినట్టు తెలిపారు.