జాతీయ వార్తలు

మీ స్ఫూర్తి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 10: దేశంలోని జిల్లా పరిషత్ పాఠశాలలు, రాత్రిపూట బడుల్లో పరిస్థితులను మెరుగు పరచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ఇటీవల హెచ్‌ఆర్‌డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జవడేకర్ ముంబయిలోని దాదర్‌లో గల గోపాల్ కృష్ణ గోఖలే నైట్ స్కూల్‌ను శనివారం సాయంత్రం సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషి ఉన్నతికి విద్య అత్యంత అవసరమని అన్నారు. పగలు 8 నుంచి 10 గంటలపాటు కష్టపడి పనిచేసి, రాత్రి సమయంలో నైట్ స్కూల్‌లో చదువుకుంటున్న ఈ పేద విద్యార్థుల స్ఫూర్తి ఎంతో అభినందించ దగినదని మంత్రి అన్నారు. దేశంలో అందరికీ విద్య అందాలని, ఎవరినీ విద్యలేని వారిగా వదలివేయకూడదని పేర్కొన్నారు. అందరికీ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యాసంస్థల్లో నైట్ స్కూల్స్ ఒకటని ఆయన అన్నారు. ‘మిమ్మల్ని కలిశాక మీకోసం పనిచేయాలనే నా సంకల్పం మరింత బలపడింది’ అని మంత్రి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ‘దళితులు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారు, వెనుకబడిన తరగతులకు చెందిన వారికోసం పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాత్రిపూట బడుల సమస్యలను మేము అధ్యయనం చేస్తాము. వాటిలో ఎంతవరకు వీలయితే అంతవరకు సమస్యలను పరిష్కరిస్తాము’ అని ఆయన అన్నారు. తాను స్వయంగా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నందున ఆ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సమస్యలను, సవాళ్లను బాగా అర్థం చేసుకోగలనని మంత్రి అన్నారు. రాత్రిపూట బడులలో, మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని మహారాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డేను కోరుతానని జవడేకర్ తెలిపారు.
chitram...
ముంబయి దాదర్‌లోని గోపాల్ కృష్ణ గోఖలే నైట్ స్కూల్ విద్యార్థులతో కేంద్ర మంత్రి జవడేకర్