జాతీయ వార్తలు

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగించటానికి కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు ఒక వినతి పత్రం అందచేశారు. వర్గీకరణ జరిగి నాలుగేళ్లు అమలు జరిగిందని ఆయన తెలిపారు. 2004లో సుప్రీమ్ కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించినందున ఆగిపోయిందిన ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది ఒక సమగ్రమైన నివేదికను అందచేయటానికి జస్టిస్ ఉషామెహ్రా కమిటీని నియమించిందని ఆయన చెప్పారు. ఈ కమిటీ తన నివేదికను అందించి నాలుగేళ్లు దాటిపోయినా ఇంత వరకూ అతీగతీ లేకుండా పడి ఉందని ఎల్లయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.