జాతీయ వార్తలు

నాణ్యమైన విద్య బాధ్యత మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై ఎమ్మెల్యేలు, ఎంపీలకు సెక్రటరీలుగా పనిచేయడాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యకోసం ఓ పథకాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల లేమిపై దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో సున్నా విద్యార్థుల పాఠశాలల్లో ప్రవేశాలపై అమికస్ క్యూరీ ఎకె గుప్తా నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటానికి, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంపై మక్కువ చూపడానికి కారణాలను నివేదికలో పేర్కొంది. కమిటీ నివేదికలో కొన్ని అంశాలపై ధర్మాసనం విభేదించింది. తాము విధానాలు రూపొందించమని, వాటి అమలను మాత్రమే చూడగలమని ధర్మాసనం స్పష్టం చేసింది. నాణ్యమైన విద్యను అందించడంలో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారంటూ తెలంగాణ తరఫున్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దీనికోసం ఓ సమగ్ర పథకాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు విద్యకయ్యే ఖర్చును అందరూ భరించలేరని మోయలేరని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపీ, ఎమ్మెల్యేలకు కార్యదర్శులుగా డిప్యూటేషన్‌పై వెళ్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య తరపున్యాయవాది శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు‘ఆ విధానాన్ని వెంటనే నిలిపి వేయాల’ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పనితీరు, పర్యవేక్షణ అధికారుల ఖాళీలపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బెంచ్ ఆదేశించింది. ప్రిన్సిపల్ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.‘అఫిడవిట్ దాఖలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.