జాతీయ వార్తలు

రాజకీయ వ్యవహారాలతో మీకేం సంబంధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: అసెంబ్లీలో మెజార్టీ కలిగిన ప్రభుత్వాలు కొనసాగుతున్నప్పుడు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో రాజకీయ సమస్యలను సృష్టించటం గవర్నర్లకు ఎంతమాత్రం తగదని అరుణాచల్ వ్యవహారంలో తాజాగా ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం అధికారంలో ఉన్న పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు రాజకీయపరమైన సంక్షోభాన్ని సృష్టించటం గవర్నర్లకు తగదని తెలిపింది. మెజార్టీలో ఉన్న ప్రభుత్వం అలాగే ప్రజాస్వామ్యరీతిలో అసెంబ్లీ కొనసాగుతున్నంత వరకూ ఈ ప్రక్రియలో గవర్నర్లకు ఎలాంటి పాత్రా ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ పూర్తిగా తనపైనే ఆధారపడినట్లుగా, తానే ఓంబడ్స్‌మన్ రీతిలో గవర్నర్ వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఎమ్మెల్యేల బేరసారాలు, అదేవిధంగా అవాంఛనీయ రాజకీయ కుయుక్తులకు కూడా గవర్నర్ దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని 174వ అధికరణం ప్రకారం అసెంబ్లీని రద్దు చేసే, ప్రొరోగ్ చేసే, అలాగే మంత్రిమండలిని తన వద్దకు రప్పించుకునే అధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికీ, ప్రభుత్వం పూర్తి మెజార్టీలో ఉన్నప్పుడు ఈ అధికారాలను వినియోగించుకునే విషయంలో రాజ్యాంగ స్ఫూర్తితోనే వినియోగించుకోవాలని కోర్టు తెలిపింది.
ప్రభుత్వ సలహా సంప్రదింపుల మేరకే గవర్నర్ వ్యవహరించాలని విస్పష్టంగా తెలిపింది. రాజకీయ సంక్షోభంలో గవర్నర్ కూడా మమేకం కావడం రాజ్యాంగ విరుద్ధమని అధికారంలో ఉన్న పార్టీలో ఎలాంటి విభేదాలు తలెత్తినా, అసంతృప్తి చెలరేగినా, తిరుగుబాట్లు చోటు చేసుకున్నా వాటన్నింటికీ అతీతంగానే గవర్నర్ తన విధులను నిర్వర్తించాలని తెలిపింది. ఓ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా అశాంతి రగులుకున్నా అవి పూర్తిగా వాటికి సంబంధించిన అంశాలే తప్ప గవర్నర్ పరిధిలోకి రావని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, మదన్ లోకూర్, టిసి ఘోస్, ఎన్‌వి రమణలతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. గవర్నర్‌ల అధికారాలకు సంబంధించి విస్పష్టమైన రీతిలో విశే్లషణలతో కూడిన తీర్పును వెలువరించింది. గవర్నర్‌కు స్పీకర్‌కు పూర్తి స్వతంత్రమైన రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాయని వెల్లడించింది.
గవర్నర్ పదవి నిర్వహించే వ్యక్తి స్పీకర్ విధుల్లో కూడా జోక్యం చేసుకోవటానికి వీల్లేదని, స్పీకర్‌నో, డిప్యూటీ స్పీకర్‌నో తొలగించినా అందులో గవర్నర్‌కు ప్రమేయం ఉండదని, రాజ్యాంగబద్ధంగా నిష్పాక్షిక రీతిలో చర్యలు చేపట్టాలని సుప్రీం తెలిపింది.