జాతీయ వార్తలు

గవర్నర్‌ను బర్తరఫ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: అరుణాచల్‌ప్రదేశ్‌పై సుప్రీం కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీలో విజయోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అదే విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రంపై తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డాయ. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్నాయా అంటూ నిలదీస్తాయ. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటంతో పాటు, గవర్నర్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కాంగ్రెస్ అభివర్ణించింది. అరుణాచల్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొందరు బీజెపి నేతలు, ఓ వ్యాపార వేత్తతో మాట్లాడిన ఆడియోటేప్ వ్యవహారంపై విచారణ జరిపించాలని కూడా కోరింది. ‘‘గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని మేం కోరుతున్నాం. ఆయన రాజీనామా చేయకపోతే, తక్షణం బర్తరఫ్ చేయాలని రాష్టప్రతిని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తుతాం’’ అని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్ అన్నారు. ‘‘రాజ్‌ఖోవా సెలవులో ఉన్నట్లు నేను విన్నాను. ఆయన దీర్ఘకాల సెలవులో వెళ్లటం మంచిది.’’ అని ఆయన అన్నారు. అరుణాచల్‌లో నబం టుకి సర్కారును పడగొట్టడానికి కుట్ర చేసి, రాష్టప్రతి పాలన విధించటం వెనుక కీలకపాత్ర పోషించిన కేంద్రమంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిబల్ డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలన్న వారి ప్రయత్నం విఫలమైంది. ఇక ముందు కూడా ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, విలువలను సంరక్షించేందుకు మరొకరు దన్నుగా ఉన్నారు. అదే సుప్రీం కోర్టు. ఆ అత్యున్నత న్యాయస్థానానికి నేను శల్యూట్ చేస్తున్నా’’ అని సిబల్ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి ఓటమి: సోనియా
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్య సూత్రాలను విచ్ఛిన్నం చేసేందుకు యత్నించిన శక్తులు ఈరోజు ఓడిపోయాయి’’ అని సోనియాగాంధీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో అధికారాన్ని మరోసారి దుర్వినియోగం చేయకుండా కేంద్రానికి సుప్రీం తీర్పు తగిన గుణపాఠం అయిందని సోనియా అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఈ అంశంపై తన స్పందనను ట్విట్టర్‌లో తెలియజేశారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యం అంటే ఏమిటనేది స్పష్టం చేసింది. దీనిని నరేంద్రమోదీ అర్థం చేసుకోవాలి’’ అని రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు.