జాతీయ వార్తలు

అరుణాచల్ ఘటనల క్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: అరుణాచల్‌ప్రదేశ్‌లో రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ నిరు డు డిసెంబర్ 9నుంచి తీసుకున్న అ న్ని నిర్ణయాలను, జారీ చేసిన అన్ని ఆదేశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఈ చరిత్రాత్మక తీర్పుకు దారితీసిన సంఘటనల క్రమం ఇలా ఉంది.
2011 నవంబర్ 1: కాంగ్రెస్ నాయకుడు నబమ్ టుకి అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకారం
2014 డిసెంబర్: మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో ఆరోగ్య మంత్రి కలిఖో పుల్‌ను మంత్రివర్గం నుంచి తప్పించిన సిఎం
2015 ఏప్రిల్: ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పుల్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ
జూన్ 1: రాష్ట్ర గవర్నర్‌గా జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా బాధ్యతల స్వీకారం
అక్టోబర్ 21: అసెంబ్లీ అయిదో సెషన్ సమావేశాల ముగింపు
నవంబర్ 3: 2016 జనవరి 14నుంచి అసెంబ్లీ ఆరో సెషన్ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ ఆదేశం
నవంబర్: డిప్యూటి స్పీకర్‌ను తొలగించడానికి తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, స్పీకర్‌ను తొలగించడానికి తీర్మానం ప్రవేశపెట్టాలని బిజెపి సభ్యుల డిమాండ్
డిసెంబర్ 9: 2016 జనవరి 14నుంచి జరగవలసిన అసెంబ్లీ ఆరో సెషన్ సమావేశాలను 2015 డిసెంబర్ 16నుంచి జరపాలని గవర్నర్ ఆదేశం
డిసెంబర్ 15: 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లోని 14మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నబమ్ రెబియా నోటీసులు జారీ
డిసెంబర్ 15: 14మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును కొట్టివేసిన డిప్యూటి స్పీకర్
డిసెంబర్ 16: ఆరో సెషన్‌ను డిసెంబర్ 16నుంచి ప్రారంభించడం లేదని స్పీకర్ తీసుకున్న నిర్ణయం అక్రమమని ప్రకటించిన డిప్యూటి స్పీకర్
డిసెంబర్ 16: అసెంబ్లీ భవనానికి తాళం వేసి టుకీ ప్రభుత్వం
మరో భవనంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి 33 మంది ఎమ్మెల్యేల హాజరు. నబియాను స్పీకర్ పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం ఆమోదం. కొత్త స్పీకర్ ఎన్నిక.
డిసెంబర్ 17: ఒక హోటల్‌లో అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు. టుకీని సిఎం పదవి నుంచి తొలగించి, కలిఖో పుల్‌ను కొత్త సిఎంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
2016 జనవరి 5: 14మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతను నిలిపివేసిన హైకోర్టు
జనవరి 6: స్పీకర్ నబమ్ రెబియా పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు
జనవరి 14: అరుణాచల్‌ప్రదేశ్ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించిన సుప్రీంకోర్టు
జనవరి 15: రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలించడం ప్రారంభించిన సుప్రీంకోర్టు
జనవరి 25: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
జనవరి 26: రాష్టప్రతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర మంత్రివర్గం సిఫారసు
జనవరి 28: రాష్టప్రతి పాలనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నబమ్ టుకీ తాజా పిటిషన్ దాఖలు
ఫిబ్రవరి 5: అసెంబ్లీ సమావేశాల తేదీలను ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఫిబ్రవరి 11: స్పీకర్ అధికారాలను గవర్నర్ లాక్కోజాలరని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
ఫిబ్రవరి 19: రాష్టప్రతి పాలన ఎత్తివేత
ఫిబ్రవరి 20: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుల్
ఫిబ్రవరి 22: గవర్నర్ విచక్షణాధికారాలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు. నష్టాన్ని నివారించే లేదా జరిగిన నష్టాన్ని పూడ్చే అధికారం తనకు ఉందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
జూలై 13: గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు