జాతీయ వార్తలు

అంగుళం కూడా వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 15: వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై చైనాకు ఏరకమైన హక్కూలేదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పును ఇచ్చిన నేపథ్యంలో కమ్యూనిస్టు పాలకులు మరింతగా తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. తమ సారభౌమత్వ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీఉండదని వివాదాస్పద ప్రాంతంలో అంగుళం స్థలాన్ని కూడా వదులుకునేది లేదని చైనా ప్రకటించింది. సార్వభౌమత్వానికి తాము తిరిగిలేని ప్రాధాన్యత ఇస్తామని ఈ విషయంలో తాము వెనుదిరిగేది లేదని చైనా దౌత్వవేత్త యాంగ్ జిచి తెలిపారు. చైనా చాలా పెద్దదేశమైనప్పటికీ చారిత్రక వారసత్వంగా వస్తున్న తమ భూ భాగంలో అంగుళాన్నికూడా వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. విదేశాంగ మంత్రికంటే కూడా ఎక్కువ హోదా కలిగిన యాంగ్ జిజి తాజా పరిణామాలపై తీవ్ర స్వరంతోనే మాట్లాడారు. పైగా భారత్‌తో జరుపుతున్న సరిహద్దు చర్చల్లో చైనా ప్రతినిధిగా యాంగ్ జిజి పాల్గొంటున్నందున దక్షిణ చైనా మహా సముద్రానికి సంబంధించి ఆయన చేసిన తాజా ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కాలంలో దక్షిణచైనా మహా సముద్ర వ్యవహారంలో భారత్ కూడా ప్రమేయం కల్పించుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.