జాతీయ వార్తలు

యునెస్కో హెరిటేజ్ స్థలాల జాబితాలో చండీగఢ్, సిక్కిం నేషనల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్/న్యూఢిల్లీ, జూలై 17: మన దేశంలోని చండీగఢ్, ప్రపంచంలోని మూడో ఎత్తయిన పర్వతం ఖంగ్జ్‌చెండ్‌జోంగాకు పుట్టినిల్లయిన సిక్కిం నేషనల్ పార్కును యునెస్కో ఆదివారం ప్రపంచ వారసత్వ సంపద స్థలాల జాబితాలో చేర్చించింది. మన దేశంతో ముడిపడిన మూడు నామినేషన్లకూ ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం. బిహార్‌లోని నలంద విశ్వ విద్యాలయం ఉన్న పురాతత్వ ప్రదేశమైన ‘నలంద మహా విహార’ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో ప్రదేశం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి శనివారం ఈ సమావేశం జరగాల్సి ఉండింది. అయితే అంతకు ముందు రోజు టర్కీలో సైనిక తిరుగుబాటు కారణంగా సమావేశం వాయిదా పడింది. చండీగఢ్‌తో సహా ఫ్రాన్స్-స్విస్ వాస్తు శిల్పి లీ కోర్బుసియర్ రూపొందించిన కళాకండాలన్నిటినీ యునెస్కో ఈ జాబితాలో చేర్చింది. 1950లో కోర్బుసియర్ చండీగఢ్ నగర నిర్మాణానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కోర్బుసియర్ రూపకల్పన చేసిన చండీగఢ్‌లోని కాంప్లెక్స్ డు కాపిటొల్, జపాన్ రాజధాని టోక్యోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ వెస్ట్రన్ ఆర్ట్స్, లా ప్లాటా(అర్జెంటీనా)లోని డాక్టర్ కురుచెట్ గృహం మార్సెల్లీ (ఫ్రాన్స్)లోని ఆర్కిటెక్చర్ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తింపు పొందిన యునైట్ డిహాబిటేషన్‌లు 20వ శతాబ్దంలో సమాజం అవసరాలకు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్‌పరంగా ఎదురయ్యే సవాళ్లకు కొత్త టెక్నిక్‌లను కనుగొనడానికి ప్రతీకలుగా నిలిచాయని యునెస్కో పేర్కొంది. ఇక ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సిక్కింలోని ఖంగ్‌చెండ్‌జోంగా నేషనల్ పార్కుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పచ్చిక మైదానాలు, లోయలు, సరస్సులు, హిమనదాలు, అత్యంత పురాతన వృక్షాలు కలిగి ఉండే మంచు దుప్పటి కప్పుకొన్న పర్వత శిఖరాలు ఈ నేషనల్ పార్కులో ఉన్నాయి.

ఎనిమిదేళ్ల బాలికపై
అత్యాచారం.. హత్య!
ముజఫర్‌నగర్, జూలై 17: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కామాంధుని దాష్టీకానికి ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలిక బలైపోయింది. బాలికను కిడ్నాప్ చేసిన ఆ మానవ మృగం అత్యాచారం చేసి రాయితో తలపై మోదాడు. రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ముజఫర్‌నగర్‌లోని కిద్వార్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఎనిమిదేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా తాన్‌జిమ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడి, రాయితో తలపై మోదాడు. స్థానికులు గమనించి వెంటనే పాపను ఆసుపత్రికి తరలించి, తాన్‌జిమ్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.