జాతీయ వార్తలు

ఢిల్లీతో నిత్యం రచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: అనేక అంశాలపై కేంద్రంతో పోరాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పనితీరువల్ల కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ‘్భరత్-పాకిస్తాన్’ సంబంధాల్లా మారాయని అన్నారు. మోదీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే బదులు తనకు సహకరించి ఉంటే ఢిల్లీ నగరంలో ఇప్పుడు సాధించిన దానికన్నా నాలుగింతలు అభివృద్ధి సాధించి ఉండేవారమని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తొలిసారి నిర్వహించిన తన ‘టాక్ టు ఎకె’ కార్యక్రమంలో అనేక వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. 21 మంది పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులను సిబిఐ అరెస్టు చేయడం, అధికారుల బదిలీలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ కళ్లకు దేశంలో తాను ఒక్కడినే ‘అవినీతి ముఖ్యమంత్రి’గా కనపడుతున్నానని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు గంటల సేపు సాగిన ఈ కార్యక్రమంలో తొలుత వివిధ అంశాలపై ప్రసంగించిన కేజ్రీవాల్ తరువాత పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. కాని, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు కలిసి వస్తుందని, విజయం సాధిస్తారని పేర్కొంటూ వీరందరి ప్రాభవానికి త్వరలోనే ముగింపు సంభవిస్తుందని ఆయన బిజెపి నాయకులను ఉద్దేశించి అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ సూచనప్రాయంగా చెప్పారు. గుజరాత్‌లో అణచివేత పరిస్థితి నెలకొని ఉన్నదని, అందువల్ల ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం చేసిన వ్యయాన్ని ఆయన సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం ఇందుకోసం కేవలం రూ.75 కోట్లు వ్యయం చేసిందని, రూ.526 కోట్లు కాదని ఆయన వివరించారు. ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వదంతులు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. వదంతులు వ్యాప్తి చేయడంలో ప్రపంచంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను మించిన సంస్థ మరోటి లేదని ఆయన దుయ్యబట్టారు.