జాతీయ వార్తలు

బన్సాల్ భార్య, కుమార్తె ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకు చిక్కిన ఐఎఎస్ అధికారి బి.కె.బన్సాల్ భార్య, కుమార్తె మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధువిహార్ ప్రాంతంలోని నీలకంఠ అపార్ట్‌మెంట్స్‌లోని తమ ఫ్లాట్‌లో బన్సాల్ భార్య సత్యబాల (58), నేహ (27) వేర్వేరు గదుల్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న బి.కె. బన్సల్ ముంబయికి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీ ప్రతినిధులనుంచి లంచం తీసుకున్న కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు సిబిఐ వెల్లడించిన విషయం విదితమే. ఢిల్లీలోని ఓ హోటల్‌లో సదరు కంపెనీ మధ్యవర్తి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో సిబిఐ దాడి చేసి అదుపులోకి తీసుకుంది.