జాతీయ వార్తలు

షీనా హత్యకు పీటర్, ఇంద్రాణి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూలై 19: ముంబైలో సంచలనం రేపిన షీనా బోరా హత్యకు కుట్ర చేసింది తల్లి ఇంద్రాణీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీయేనని సిబిఐ ముంబై హైకోర్టుకు తెలియజేసింది. పీటర్ కుమారుడు రాహుల్‌తో ఆమె ప్రేమ సంబంధం వీరిద్దరికీ నచ్చలేదని, అందువల్లే హత్యకు పథకం రచించారని స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు చాలా కీలకమైన దశలో ఉందని ఈ పరిస్థితిలో పీటర్‌కు బెయిలు ఇవ్వటం సరికాదని, ఒకప్పటి మీడియా రారాజు అయిన ఆయన కేసును తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇంద్రాణి, పీటర్ చాలా ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో, ఎవరికీ అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ వేసి షీనాను 2011 ఏప్రిల్ 3న హతమార్చారని సిబిఐ న్యాయస్థానానికి తెలియజేసింది. ఇందుకు సంబంధించిన సమాచారంతో ఓ అఫిడవిట్‌ను సిబిఐ తరపు న్యాయవాది, జస్టిస్ పి.ఎన్. దేశ్‌ముఖ్‌కు సమర్పించారు. ఈ కేసును న్యాయమూర్తి జూలై 27కు వాయిదా వేశారు. షీనా హత్య కేసులో పీటర్‌ను నిరుడు నవంబర్ 19న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇక లాఠీ చార్జీలుండవు
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ముందే దరఖాస్తుల స్వీకారం
న్యూఢిల్లీ, జూలై 19: సైన్యంలో రిక్రూట్‌మెంట్ సందర్భంగా లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలకు తావులేకుండా రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. దీనివల్ల రద్దీని నివారించడంతోపాటు రిక్రూట్‌మెంట్‌ను సజావుగా నిర్వహించడానికి వీలుంటుందని స్పష్టం చేశారు. ముందే దరఖాస్తులు చేసుకోవడంవల్ల క్రమశిక్షణతో రిక్రూట్‌మెంట్ పూర్తిచేయొచ్చని పారికర్ చెప్పారు. ఇంతకు ముందు దరఖాస్తుల స్వీకరణ, దేహదారుఢ్య పరీక్షలు ఒకేసారి నిర్వహించడం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగేవన్నారు. రద్దీని నియంత్రించలేక లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగం చేయాల్సి వచ్చేదని తెలిపారు. ఇక నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు కవరయ్యేలా నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి కొన్ని ప్రాంతాల్లో సమస్యలుంటాయన్న దృష్టితో ఆఫ్‌లైన్ ద్వారా కూడా అందజేసేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు పారికర్ స్పష్టం చేశారు.