జాతీయ వార్తలు

తెలియక తప్పు చేశాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటు భద్రతపై వీడియో తీయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ శుక్రవారం బేషరతు క్షమాపణ చెప్పారు. తెలియకుండా తప్పు చేశానని, ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని తాను అనుకోలేదని మాన్ చెప్పారు. అయితే ఈ ఘటనకు క్షమాపణలు సరిపోవని, కమిటీ వేస్తామని, అన్ని పార్టీలకు చెందిన సభ్యులు తీవ్రంగా కలత చెందారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనకు చెప్పారు. భగవంత్ చర్యలపై లోక్‌సభలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.
భగవంత్ మాన్ భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంటులోపలికి ప్రవేశించడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 12 నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో ఆయన కామెంటరీ కూడా చెప్పారు. దీనిపై చర్యలు తీసుకున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనకు సమన్లు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు మాన్ స్పీకర్ కార్యాలయంలో ఆమె ముందు హాజరయినప్పుడు ఆమె ఆయనను తీవ్రంగా మందలించారు. అయితే తాను దురుద్దేశంతో ఈ వీడియో తీయలేదని, పార్లమెంటు భద్రత గురించి తన నియోజకవర్గం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాన్ తెలిపారు. జీరో అవర్‌కు హాజరవడానికి పార్లమెంటుకు వస్తున్నప్పుడు తాను ఈ వీడియో తీశానని, ఇలా చేయడం నిబందనలకు విరుద్ధమనే విషయం తెలియకపోవడం వల్ల పొరబాటున వీడియో తీశానని స్పీకర్‌కు అందజేసిన క్షమాపణ లేఖలో మాన్ తెలిపారు. పార్లమెంటు భద్రతను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన అంటూ, తాను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాని, భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ చేయనని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు.
అయితే మాన్ క్షమాపణతో స్పీకర్ సంతృప్తి చెందలేదు. పార్లమెంట్‌పై ఉగ్రవాదులు ఒకసారి దాడి చేశారని, దాన్ని దృష్ట్యా చూసినట్లయితే ఇది చాలా తీవ్రమైన విషయమని ఆమె అన్నారు. ఒక వేళ ఇది పార్లమెంటులోపల సభా కార్యక్రమాలకు సంబంధించిన విషయం అయి ఉంటే తాను వెంటనే చర్య తీసుకుని ఉండే దానినని అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సుమిత్రా మహాజన్ అన్నారు. అయితే ఇది పార్లమెంటు కాంప్లెక్స్‌కు సంబంధించిన విషయం అయినందున తగు చర్య కోసం అన్ని పార్టీల నేతలను సంప్రతిస్తానని ఆమె చెప్పారు. ఇది పార్లమెంటు భధ్రతకు సంబంధించిన అంశం గనుక, ఎంపీలు ప్రజలకు ప్రతినిధులు అయినందున నైతిక విలువలకు, హక్కులకన్నా తీవ్రమైన విషయమని స్పీకర్ అభిప్రాయ పడ్డారు.