జాతీయ వార్తలు

నైతిక వర్తనకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, జూలై 22: దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో స్వామీజీలు, వివిధ మతాలకు చెందిన మఠాలు కీలకపాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు వీరిలో చాలా మంది ఇప్పటికే టాయిలెట్లు నిర్మించడం, వైద్య సేవలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని కూడా ఆయన అన్నారు. ‘లక్షల సంఖ్యలో ఉన్న స్వామీజీలు, వేలాది పీఠాలు, వందలాది మఠాలు భారత దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో, అలాగే దేశ ప్రజల్లో నైతిక విలువలవను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. చాలా మఠాలు, పీఠాలు ఇప్పటికే ఈ పని చేస్తున్నాయి. దేశ భవిష్యత్తుకు ఇది గొప్ప శక్తి అవుతుంది’ అని శుక్రవారం ఇక్కడ హిందుత్వ నేత, గోరఖ్‌పూర్ బిజెపి ఎంపి అయిన యోగి ఆదిత్యనాథ్ గురవయిన మహంత్ అవైద్యనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రధాని అన్నారు. నాలుగు సార్లు బిజెపి ఎంపిగా ఉండిన అవైద్యనాథ్ అయోధ్య రామమందిర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన 2014లో చనిపోయారు. ప్రభుత్వం గత ఏడాది ఆయన తొలి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక తపాలాబిళ్లను విడుదల చేసింది కూడా. వచ్చే ఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని గోరఖ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అవైద్యనాథ్ సమాజం సంక్షేమం కోసం కృషి చేశారని, ఆయన శిష్యుడు ఆదిత్య నాథ్ ఆయన చేసిన మంచి పనులను కొనసాగిస్తున్నారని ప్రధాని చెప్పారు. మన సాధువులు, సన్యాసులు ఎంతో గొప్పవారని, సమాజం, ప్రజల పట్ల వారు ఎంతో ప్రేమగా ఉంటారని ఆయన అన్నారు. ఒక ఆలయం లోపల జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట యుపి గవర్నర్ రాంనాయక్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ కూడా ఉన్నారు.
chitram...
గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో మహంత్ అవైద్యనాథ్ సంస్మరణ సంచికను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ