జాతీయ వార్తలు

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఉగ్రవాద దాడి జరిగేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్ర నిఘా ఏజెన్సీలు ఢిల్లీ పోలీసులను, ఇతర సీనియర్ అధికారులను హెచ్చరించాయి. దేశ రాజధాని నగరంలోని అన్ని కీలక స్థావరాలు, ప్రాంతాల వద్ద గట్టి నిఘా, నియంత్రణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశాయి. తమకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలోని కీలక ప్రాంతాలపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు స్పష్టం అవుతోందని వెల్లడించాయి. ముఖ్యంగా సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో వారికి గట్టి భద్రతను కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, ఐటిబిపి అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో (రా)లకు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్, గుర్‌గాం వంటి ప్రాంతాల్లో కూడా ముందస్తుగా నిరోధక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని వెల్లడించాయి. రాత్రిపూట కీలక స్థావరాలు గస్తీని మరింత ముమ్మరం చేయాలని, అన్ని రకాలుగా తనిఖీలను విస్తృతం చేయాలని తెలిపాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుని ఉగ్రవాదులు దేశ రాజధాని నగరంపై దాడులను ఒడిగట్టేందుకు ఆస్కారం ఉందని ఇటీవల తమకు అందిన సమాచారం ఈ విషయాన్ని మరింతగా ధ్రువీకరిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి.
- నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం -
ప్రధాని ఓలీ రాజీనామా
ఖాట్మండు, జూలై 24: నేపాల్ మళ్లీ రాజకీయ సంక్షోభ కూపంలో చిక్కుకుంది. తనపై విపక్షాలు ఎక్కుపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరక్కుండానే ప్రధాన మంత్రి కెపి ఓలీ ఆదివారం రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రయత్నాన్ని విదేశీ శక్తుల కుట్రగా ఆయన అభివర్ణించారు. దేశాన్ని ఓ ‘ప్రయోగశాల’గా మార్చాలన్నదే దీని ఉద్దేశమని, కొత్త రాజ్యాంగం అమలుకాకుండా అడ్డుపడ్డారంటూ ఓలీ నిప్పులు చెరిగారు. సంకీర్ణ ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఆ నేపథ్యంలోనే విపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. సంక్షోభం తీవ్రంకాకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని, దేశాధ్యక్షుడికి దీన్ని అందిస్తానని వెల్లడించారు.మావోయిస్టు నాయకుడు ప్రచండ సారథ్యంలోని సిపిఎన్-మావోయిస్టు, నేపాలీ కాంగ్రెస్‌లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అధికార కూటమిలోని రెండు కీలక పార్టీలు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి తీవ్రమైంది.