జాతీయ వార్తలు

కాశ్మీర్‌పై నోరు జోరకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 24: ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్‌లో కలవడం ఖాయమంటూ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మితిమీరిన ఆకాంక్షకు అద్దం పడుతున్నాయని దేశీయ పత్రికలే దుమ్మెత్మిపోశాయి. ఈ రకమైన ప్రకటనలు చేయడం ఇటు పాకిస్తాన్‌కు, అటు కాశ్మీర్ ప్రజలకు మంచిది కాదని డైలీ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. దేశంలో ఓట్లను సంపాదించుకోవడానికి అవాస్తవమైన, అర్థరహితమైన ప్రకటనలు చేయడం అన్నది దేశ రాజకీయ నాయకులకు అలవాటైపోయిందని, అయితే కాశ్మీర్ గురించి మాటలు చెప్పడం తేలికే అయినా, అసలు అది పాకిస్తాన్‌లో ఎలా కలుస్తుంది అనేది ఎవరికీ అంతుపట్టని మిస్టరీయేనని ఆ పత్రిక తన సంపాదకీయంలో తెలిపింది. కాశ్మీర్ పాకిస్తాన్‌లో ఎప్పుడు కలుస్తుందా అని ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ పత్రికే నవాజ్ ప్రకటనపై నిప్పులు చెరగడం.. ఆయన వ్యాఖ్యలు కేవలం జనాన్ని ఆకట్టుకోవడానికేనని చెప్పడం కలకలం రేపుతోంది. ఈ రకమైన ప్రకటనల వల్ల దేశ ప్రజలు ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారని కూడా హెచ్చరించింది. గత ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అన్నది అయితే చర్చల ద్వారానో లేదా యుద్ధం ద్వారానో సాధ్యమవుతుందని, ఈ రెండింటికీ మించిన ప్రత్యామ్నాయం మరోటి లేదని తెలిపింది.

‘అఫ్‌స్పా’ ఎత్తివేతకు మెహబూబా సానుకూలం

శ్రీనగర్, జూలై 24: జమ్మూకాశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా)ను పూర్తిగా ఎత్తివేసే అంశం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం సానుకూలంగా స్పందించారు. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత కాశ్మీర్‌లో విస్తృతంగా హింస పెచ్చరిల్లిన నేపథ్యంలో ప్రజల మద్దతును పొందేందుకు ఆమె ఈ వైఖరి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ‘కొన్ని ప్రాంతాల్లో అఫ్‌స్పాను ఎత్తివేసి, ఆ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తాం. ఒకవేళ విజయవంతమయితే పూర్తిగా ఎత్తివేస్తాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. కాశ్మీర్‌లో ఇబ్బందులు సృష్టిస్తోందంటూ పాకిస్తాన్‌పై మెహబూబా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ తాను ఒక ఉగ్రవాద బాధిత దేశాన్నని పేర్కొంటోందని, మరోవైపు తుపాకులు పట్టాల్సిందిగా కాశ్మీర్ యువతను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలని మెహబూబా హితవు పలికారు. ఇరు దేశాల మధ్య చర్చలను పునరుద్ధరించాల్సిన, విశ్వాస నిర్మాణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాల మెరుగుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకొని లాహోర్‌ను సందర్శించారని, దురదృష్టవశాత్తు పఠాన్‌కోట్‌పై ఉగ్రవాద దాడి తరువాత చర్చల ప్రక్రియ స్తంభించిపోయిందని మెహబూబా అన్నారు. పాకిస్తాన్ స్వదేశంలో తుపాకులు పట్టుకున్న పిల్లలను శిక్షిస్తూ, మరోవైపు కాశ్మీర్‌లో తుపాకులు పట్టుకున్న యువతను కీర్తిస్తోందని, ఇది ఆ దేశ వంచనను వెల్లడిస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని తాము అర్థం చేసుకున్నామని, అందుకే ఆ దేశం లాల్ మసీదు ఆపరేషన్ నిర్వహించిందని మెహబూబా అన్నారు.

తెలుగును విస్మరించ వద్దు: యార్లగడ్డ
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 24: తెలుగు భాష అభ్యున్నతికి బాటలువేసి, సాధారణ ప్రజలకు తమ రచనల ద్వారా తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేసిన వైతాళికులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని డా.లక్ష్మిప్రసాద్ అన్నారు. శుక్రవారం అమెరికా బే-ఏరియాలోని రాయల్ ప్యాలెస్ సమావేశ మందిరంలో తానా, బాటా, మన-పాఠశాల అధ్యర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో యార్లగడ్డ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ మాతృభాషకు సేవ చేసిన వారి గృహాలు, వాడిన వస్తువులను పదిలపరిచి వాటిని ప్రపంచాస్థాయి పర్యాటక ప్రదేశాలుగా చేశారన్నారు. అయితే మన దేశంలో అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భాషాభివృద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో త్యాగధానులను సరైనా రీతిలో గౌరవించుకొవడానికి ప్రతి ప్రవాసీయుడు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.