జాతీయ వార్తలు

పనిచేయకపోతే ఇంక్రిమెంట్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సరిగ్గా పనిచేయని వారికి ఇకపై వార్షిక ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. ప్రమోషన్లు రావాలన్నా పనితీరుకు ‘గుడ్’, ‘వెరీ గుడ్’ అన్న కొలమానాలకు చేరుకోవలసి ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివి. సవరించిన ఉద్యోగ పురోగతి పథకం(ఎంఏసిపి) కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 10, 20, 30 ఏళ్ల సర్వీసును ఇంతకుముందులాగానే సమీక్షిస్తారు. ‘నిర్దేశిత కొలమానానికి చేరుకోని ఉద్యోగికి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయటంతో పాటు, తొలి ఇరవై సంవత్సరాల సర్వీసులో రెగ్యులర్ ప్రమోషన్‌ను కూడా నిలిపేయాలన్న ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆమోదించినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.