జాతీయ వార్తలు

పాక్‌ది ప్రత్యక్ష పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రాస్ (కార్గిల్), జూలై 26: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నేరుగా ఎగదోస్తోందని ఆర్మీ ఉత్తర కమాండ్ సైనిక దళాల ముఖ్య అధికారి (జిఓసి) లెఫ్టెనెంట్ జనరల్ డిఎస్ హూడా ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధీన రేఖ వెంబడి చొరబాటు యత్నాలు మరింత ఎక్కువ కావచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘జమ్మూ, కాశ్మీర్‌లో ప్రచ్ఛన్న యుద్ధంలో పాకిస్తాన్ ప్రత్యక్ష పాత్ర ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు’ అని 17వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం ఇక్కడి అమరవీరుల స్మారక స్థూపంవద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ హూడా అన్నారు. చొరబాటుకు యత్నించే ముఠాలకు మద్దతు ఇచ్చే విషయంలో, జనాన్ని భారత భూభాగంలోకి చొప్పించడానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే విషయంలో.. ఇలా సరిహద్దు పొడవునా ఎక్కడ చూసినా మనకు ఇది కన్పిస్తుంది’ అని కాశ్మీర్‌లో ప్రస్తుత అశాంతిపై విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా హూడా చెప్పారు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏ చిన్నపాటి అశాంతి ఉన్నా వాళ్లు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటారు. కాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లకు తాము మద్దతు తెలియజేస్తున్నట్లు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా లాంటి మిలిటెంట్లు ముఠాలు చేస్తున్న ప్రకటనలను మీరు చూసే ఉంటారు’ అని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో యువత రానురాను తీవ్రవాద భావజాలంవైపు మొగ్గు చూపడం పెరిగిపోతుండడం పట్ల హూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా, కొంతమంది జనం ఈ విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ ధోరణిని తగ్గించడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, అధీన రేఖ వెంబడి రానున్న రోజుల్లో చొరబాటు యత్నాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. గత కొద్దిరోజుల్లో కొన్ని చొరబాటు యత్నాలను భగ్నం చేశామని, అయితే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి తగ్గుతాయని తాము అనుకోవడం లేదని హూడా అంటూ, అయితే వాటిని ఎదుర్కోవడానికి తాము సర్వసిద్ధంగా ఉన్నామన్నారు.

కాశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ నిర్మానుష్యంగా ఉన్న శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతం