జాతీయ వార్తలు

దురదృష్టం.. అన్నీ చెడు సంకేతాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరి జాడ తెలియకుండా పోయిన వాయుసేనకు చెందిన ఎఎన్32 విమానం గాలింపు చర్యలు మంగళవారానికి అయిదు రోజుకు చేరుకున్న నేపథ్యంలో విమానంలో ఉన్న 29 మందిని ప్రాణాలతో కనుగొనగలమన్న ఆశలు దాదాపుగా సన్నగిల్లి పోతున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి లభిస్తున్న సంకేతాలన్నీ కూడా చెడు సంకేతాలేనని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా వ్యాఖ్యానించడమే. ‘విమానం అదృశ్యంపై ఇప్పటివరకు ఎన్నో సంకేతాలు అందాయి. అయితే ఇవన్నీ కూడా చెడు సంకేతాలనే సూచిస్తున్నాయి. ఏదయినా ఒక నిర్ణయానికి రావడానికి ముందు వీటన్నిటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. అయితే వీటిలో కొన్ని చెడు సంకేతాలు కూడా ఉన్నాయి’ అని పారికర్ మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. గాలింపు చర్యలకోసం అత్యాధునిక నౌక సాగర్ నిధిని మారిషస్‌నుంచి రప్పిస్తున్నట్లు పారికర్ చెప్తూ, అది త్వరలోనే వస్తుందని, అయితే ఏదయినా లోతయిన సముద్రంలో గాలింపు జరిపే నౌక పని చేయాలంటే నిర్దిష్టమైన ఏరియా ఉండాలని ఆయన అన్నారు. జలాంతర్గామి నిర్దిష్టమైన ప్రాంతాన్ని గుర్తిస్తే ఆ తర్వాత దాన్ని పంపవచ్చని ఆయన అన్నారు.
గతంలో డార్నియర్ విమానం కూలిపోయినప్పుడు సైతం ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మిటర్ (ఇఎల్‌టి) పని చేయలేదంటూ కోస్టుగార్డుకు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పిన మాటలతో పారికర్ ఏకీభవించలేదు. సముద్రం లోతు ఎక్కువగా ఉన్నందున మొదట్లో శబ్దాలు రాలేదు కానీ జలాంతర్గామి డార్నియర్ కూలిపోయిన చోటికి వెళ్లినప్పుడు ఆ సంకేతాల కారణంగానే దాన్ని గుర్తించిందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పని చేస్తోందో లేదా తాము చెప్పలేమని, అయితే ఆ శబ్దాలను వినలేకపోతున్నామనేది వాస్తవం అని పారికర్ అన్నారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటనకు కారణాన్ని ఇప్పటికిప్పుడు నిర్ధారించలేమని, అయితే ప్రాథమికంగా వాతావరణం కారణమై ఉండవచ్చని వైమానిక దళానికి చెందిన ఓ అధికారి అన్నారు. విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగా లేదని, అయితే పైలట్ అన్ని ముందస్తుజాగ్రత్తలు తీసుకున్నారని ఆ అధికారి చెప్పారు.
‘అఫ్‌స్పా’పై హోంశాఖదే నిర్ణయాధికారం
జమ్మూ, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలనుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ)ను ఎత్తివేయాలన్న రాష్ట్ర మఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన పారికర్ ఈ అంశం హోం మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందని, దీనిపై నిర్ణయం తీసుకోవలసింది ఆ శాఖేనని చెప్పారు. సరిహద్దుల్లో భద్రత, రాష్ట్రంలోని తీవ్రవాద నిరోధక వ్యవస్థలో మాత్రమే సైన్యం పాత్ర ఉందని ఆయన చెప్పారు. సైన్యానికి సంబంధించినంతవరకు సరిహద్దులను చొరబాట్లకు వీలులేని విధంగా ఉంచడం, ఏ చొరబాటు యత్నం కూడా ఫలించకుండా చూడడమని, మా పనిని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం అని వివరించారు. ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నంలో తొలి అడుగుగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలనుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని మెహబూబా ముఫ్తీ గత ఆదివారం సూచించడం తెలిసిందే.
కార్గిల్ దివస్ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న రక్షణ శాఖ మంత్రి పారికర్. చిత్రంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్