జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పట్టుబడిన మిలిటెంట్ పాకిస్తాన్‌కు చెందినవాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 27: జమ్మూ, కాశ్మీర్‌లో మంగళవారం భీకర ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకున్న టెర్రరిస్టు పాకిస్తాన్ జాతీయుడని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. అతనిని పాకిస్తాన్‌లోని లాహోర్ నగరానికి చెందిన బహదూర్ అలీగా గుర్తించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా చెప్పారు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కరే తోయిబా మిలిటెంట్లను హతమార్చిన భద్రతా దళాలు బహదూర్ అలీని ప్రాణాలతో పట్టుకున్న విషయం తెలిసిందే. బహదూర్ అలీ 22 ఏళ్ల యువకుడని, గెరిల్లా యుద్ధతంత్రాల్లో లష్కరే తోయిబానుంచి శిక్షణ తీసుకున్నాడని తెలుస్తోంది. అతని వద్దనుంచి భద్రతా దళాలు మూడు ఎకె-47 రైఫిళ్లు, రెండు పిస్టళ్లు, 23 వేల రూపాయల భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని కుప్వారా జిల్లాలో ఒక పాకిస్తానీ టెర్రరిస్టు ప్రాణాలతో పట్టుబడడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీత్వాల్ ప్రాంతంనుంచి కాశ్మీర్ లోయలోకి సోమవారం ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపారు. అక్కడినుంచి వాళ్లు తంగ్‌ధార్ సెక్టార్‌కు, ఆ తర్వాత అక్కడినుంచి లీపావ్యాలీకి వెళ్లారని తర్వాత ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న ప్రాంతంలోని ఓ అడవిలో దాక్కున్నారని తెలుస్తోంది.