జాతీయ వార్తలు

సవాళ్లకు పరిష్కారాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలతో కలసి పనిచేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దైనందిన జీవనంలో ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరమైన పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
దేశంలో కొత్త ఆవిష్కరణలకోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో వెల్లడించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రియో ఒలింపిక్ క్రీడల్లో మన దేశం పాల్గొంటుండటం, స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇటీవల దక్షిణాఫ్రికాలో తాను జరిపిన పర్యటన, అడవుల అభివృద్ధికోసం రాష్ట్రాలకు రూ.40 వేల కోట్లకు పైగా నిధులను సమకూర్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించడం తదితర పలు అంశాలను మోదీ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన మనకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ వరదల వలన కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అయితే వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం అస్సాం, బిహార్ తదితర పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తి అనేక మంది ప్రాణాలను హరించడంతోపాటు భారీగా ఆస్తి నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో ప్రధాని ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
‘దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దైనందిన జీవనంలో మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలకు సాంకేతిక పరమైన పరిష్కారాలను కనుగొనడంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిష్కారాల కోసం యువత పరిశోధనలు సాగించాలి’ అని మోదీ ఉద్ఘాటించారు. ఈ దిశగా ప్రయోగాలను, ఆవిష్కరణలను ప్రోత్సహించి వాటిని పారిశ్రామికంగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలన్న లక్ష్యంతో ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’ (ఎఐఎం) అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రధాని వెల్లడించారు. ‘తదుపరి తరం ఆవిష్కర్తలను మనం సిద్ధం చేయాలనుకుంటే ఎఐఎంతో మన పిల్లలను అనుసంధానించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పథకాన్ని చేపడుతోంది.
ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసే పాఠశాలలకు రూ.10 లక్షల చొప్పున నిధులు అందజేయడంతో పాటు ఐదేళ్ల పాటు ఆ ల్యాబ్‌ల నిర్వహణకు అంతే మొత్తంలో నిధులను సమకూర్చడం జరుగుతుందని మోదీ వివరించారు. నిత్య జీవితంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించిన వారికి రివార్డులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోందని, మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలామ్‌కు ఇదే నిజమైన నివాళి అవుతుందని ప్రధాని తెలిపారు.
ప్రతి నెలా 9న ఉచిత వైద్య పరీక్షలు
ప్రసవ సమయాల్లో మరణాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రధా ని ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి నెలా 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలను అందజేస్తాయని, ఈ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒక రోజు సమయాన్ని కేటాయించి ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయని గైనకాలజిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశానికి లక్షలాది మంది గైనకాలజిస్టుల అవసరం ఉందని ఆయన తెలిపారు.