జాతీయ వార్తలు

భారత గగనతలంపై చైనా గూఢచర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ఉత్తరాఖండ్‌లోని బారాహోతి ప్రాంతంలో చొరబడ్డ చైనా ఆర్మీ ఇంతకుముందు కూడా తన యుద్ధవిమానాల్ని భారత భూభాగంలోకి పంపించినట్లు మన ఆర్మీ గుర్తించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ట్యుపొలొవ్‌టు 153ఎం యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్లు సైన్యం గుర్తించింది. సింథటిక్ అపెర్చుర్ రాడార్ ద్వారా అధిక రెసొల్యూషన్ కలిగిన చిత్రాలను తీసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత మూడు మాసాల్లో ఈ విమానం మూడు సార్లు మన గగనతలంపై తిరిగిందని ధ్రువీకరించాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా నుంచి సేకరించిన సాంకేతిక పరిజ్ఞానంతో చైనా ఈ రాడార్‌ను రూపొందించిదని తెలిపాయి. ఈ మూడు రాష్ట్రాలపై 40వేల అడుగుల ఎత్తుపైనుంచి చైనా విమానం తిరిగిందని, ఇది ఏ రాడారూ గుర్తించడానికి వీల్లేకుండా 60వేల అడుగుల ఎత్తుకు కూడా ఎగరగలదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.