జాతీయ వార్తలు

ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 31: గుజరాత్‌లో దళితులపై దాడులు పెరిగిపోవడానికి నిరసనగా ఆందోళన చేస్తున్న వేలాది మంది దళితులు ఆదివారం అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి చనిపోయిన పశులకు అంత్యక్రియలు నిర్వహించే తమ వృత్తిని వదిలిపెట్టాలని ఆ ర్యాలీలో ప్రసంగించిన దళిత నేతలు తమ కులం వారికి పిలుపునిచ్చారు. తమపై జరుగుతున్న దాడులను అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల 11న ఉనాలో గోరక్షా సమితి కార్యకర్తలు నలుగురు దళితులను చావగొట్టిన సంఘటనకు నిరసనగా ఆగస్టు 5న అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు పాదయాత్ర నిర్వహించాలని కూడా వారు పిలుపునిచ్చారు. తమ వారిపై జరిగిన దాడికి నిరసనగా రాష్టవ్య్రాప్తంగా దళితులు సాగిస్తున్న ఆందోళనలో భాగంగా నగరంలోని సబర్మతి ప్రారంభంలో ఈ మహా సమ్మేళనాన్ని నిర్వహించారు.
దళిత నాయకుడు, ఈ కార్యక్రమం కన్వీనర్ జిగ్నేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లు ఉంచడంతో పాటుగా, ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపించడానికి తమ కులవృత్తి అయిన చనిపోయిన పశులను పూడ్చే పనిని మానేస్తామంటూ ప్రతిన చేయాలని తమ కులం వారికి పిలుపునిచ్చారు. మురికి కాల్వలను శుభ్రంచేసే పనిని కూడా మానేయాలని దళితులను కోరుతూ, గౌరవప్రదమైన జీవితం గడపడానికి వారికి వ్యవసాయ భూములను కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దళితులపై దాడులు ఆగకపోతే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. దళితులను చితకబాదిన అందరినీ సంఘ వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద అరెస్టు చేయాలని, ఒక వేళ వారు బెయిలుపై బైటికి వస్తే వారిని అయిదు జిల్లాలనుంచి వెలివేయాలని కూడా డిమాండ్ చేశారు.

అహ్మదాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి భారీగా తరలివచ్చిన దళితులు