జాతీయ వార్తలు

పెట్రో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: గత నాలుగు వారాల్లో వరుసగా మూడోసారి దేశంలోని పెట్రోలు వినియోగదారులకు ఊరట లభించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే విధంగా పెట్రోలుపై లీటరుకు రూ.1.42, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.01 ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ఉత్పత్తుల ధరలు తగ్గటంతో ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గిన ఈ ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు రేటు లీటర్ రూ.61.09, డీజిల్ రూ. 52.07 కు చేరుతుంది. ఈనెల 16న చివరిసారిగా పెట్రోల్‌పై రూ.2.25, డీజిల్‌పై రూ. 0.42 తగ్గించారు. అంతకుముందు కూడా పెట్రోల్‌పై రూ.0.89, డీజిల్‌పై రూ.0.42 పైసలు తగ్గాయి.