జాతీయ వార్తలు

ఆనందీ వారసుడెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ స్థానే కొత్త సిఎంను ఎన్నుకునే అంశాన్ని బుధవారం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఆనందీ రాజీనామాను ఆమోదించడంతో పాటు కొత్త సిఎంగా ఎవర్ని నియమించాలన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే కాకుండా వారంలోగానే ఆనందీ వారసుడ్ని ఎన్నుకునే అవకాశం ఉందని, ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్మదాబాద్ వెళ్లి అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగేలా పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పటేళ్ల కోటా ఉద్యమం, దళితుల ఆందోళనల నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బిజెపి నాయకత్వానికి ఓ సవాలుగానే భావిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో ద్వితీయ స్థానంలో ఉన్న నితిన్ పటేల్‌కే కొత్త ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గుజరాత్ బిజెపి అధ్యక్షుడు విజయ్ రూపానీ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా భావిస్తున్న నితిన్ పటేల్‌కే సిఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో నితిన్ పనిచేయడంగానే చెబుతున్నారు.