జాతీయ వార్తలు

హామీ ఇచ్చారు.. ఇప్పుడు చర్చ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగష్టు 2:ఏపీ విభజన చట్టంలో హామీలు ఇచ్చి, ఎన్నికలకు ముందు వాగ్దానాలూ చేసినప్పుడు మళ్లీ పార్లమెంట్‌లో చర్చలెందుకని వైకాపా ఎంపీలు ప్రశ్నించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,సుబ్బారెడ్డి,బుట్టా రేణుక,వరప్రసాద్‌రావులు విలేఖరులతో మాట్లాడారు. వైఎస్సార్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి మాట్లాడుతూ విభజన చర్చలు పేరిట ఎన్ని రకాలుగా ఏపీకి అన్యాయం చేయాలో అన్ని మార్గాలు వెతుకుతున్నారని విమర్శిచారు. ఏన్డీయో అధికారంలోకి వచ్చి ఇప్పటికే 26 నెలలు అయిపోయిందని,కాని ఇప్పటికీ హామిలు నెరవేర్చలేదన్నారు. ఏపీ విభజనలో చంద్రబాబు పాపం ఉందని, హోదా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తే భవిష్యత్తులో తనకు సమస్యలు వస్తాయనే చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తీసుకురావడంలేదన్నారు. బీజేపీ-టీడీపీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేశాయని ప్రజలు భావిస్తున్నారని,అందుకే బంద్‌లో అన్ని వర్గాలు పాల్గొన్నాయన్నారు.