జాతీయ వార్తలు

హోదాపై వేచిచూస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగష్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు,ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలను తాత్కాలిక విరమిస్తున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. టీడీపీ ఎంపీలతో కలసి ఆయన ఏపీభవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని లోక్‌సభలో అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అందుకే తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచిచూస్తామని చెప్పారు. మంత్రి వర్గంలో కొనసాగుతునే కేంద్రాన్ని సభలో ప్రశ్నించామని, తమ చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తాము ఆందోళనలు చేస్తుంటే లోక్‌సభలోకాంగ్రెస్ ఎంపీలు కనిసం స్పందించలేదని విమర్శించారు. రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు కాంగ్రెస్ ఉనికిని కోసమేనన్నారు. ప్రత్యేకహోదా విషయంలో వైకాపాకి చిత్తశుద్ధి లేదన్నారు.వైకాపా ఎంపీలు లోక్‌సభలో కోంతసేపు ఆందోళన చేసి వెళ్లిపోయారని, అర్థికమంత్రి లోకసభలో ప్రకటన సందర్భంగా ఒక్క ఎంపీ కూడా లేరన్నారు.ప్రత్యేక హోదా కోసం బంద్‌ల పేరుతో ప్రజల ఆస్తులను ధ్యంసం చేయాలన్నదే వైకాపా ఉద్దేశమన్నారు. ప్రత్యేక హోదా,విభజన హామీలపై కేంద్రానికి టీడీపీ గడువు పెట్టే ఆలోచన లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
అలాగే జిఎస్‌టి బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందనీ వెల్లడించారు. తమ ఆందోళనలకు స్పందించిన ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు.