జాతీయ వార్తలు

జైట్లీ ప్రకటన వెనుక సుజన, రమేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2:టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తెర వెనక చేసిన ప్రయత్నం మూలంగానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారనే మాట వినిపిస్తోంది.
జైట్లీ మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు లోక్‌సభకు వచ్చి ఏపికి చేయవలసిన సాయంపై తనంతటతాను ఒక ప్రకటన చేయాలనుకున్నప్పుడు సభలో తోట నరసింహం మినహా తెలుగుదేశం సభ్యులెవరూ లేరు. జైట్లీ నరసింహాన్ని పిలుచుకుని ‘ఏపికి చేయవలసి సాయంపై ఒక ప్రకటన చేస్తాను, మీ సభ్యులను సభకు రప్పించాల’ని సూచించినట్లు తెలిసింది. జైట్లీ ఈ సూచన చేయగానే నరసింహం బయటకు వెళ్లి తమ పార్టీ సభ్యులకు వర్తమానం పంపించారు. దీంతో వెంటనే పలువురు తెలుగుదేశం సభ్యులు లోక్‌సభలోకి వచ్చి ప్రత్యేక హోదా కోసం నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. మామూలుగా అయితే తెలుగుదేశం సభ్యులు మధ్యాహ్నం తరువాత లోక్‌సభలో గొడవ చేయటం లేదు. టిడిపి సభ్యులు కొద్దిసేపు నినాదాలు ఇవ్వగానే జైట్లీ లేచి ఏపికి చేయవలసిన సాయంపై ప్రకటన చేశారు. ‘తెలుగుదేశం సభ్యులు ఒక అంశంపై ఆందోళన చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్‌కు చేయవలసిన సహాయంపై ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని నేను పలుమార్లు చెప్పాను, నేను ఈరోజు కూడా ఏపి ముఖ్యమంత్రితో మాట్లాడాను, ఈ సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు. కాగా జైట్లీ ప్రకటన చేస్తారన్న సంగతి తెలియకపోవడంతో వైకాపా సభ్యులెవరూ మధ్యాహ్నం సభకు రాలేదు.
కాస్త ఓపిక పట్టాలి : బాబుతో జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో ఏం మాట్లాడారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏపికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం నుండి మరికొంత సమాచారం రావలసి ఉందనీ, అది రాగానే ఎంత సాయం చేయాలనే అంశంపై ఒక నిర్ణయానికి వస్తామనీ, వీలున్నంత త్వరగా ఏపికి చేయవలసిన సాయంపై ప్రకటన చేస్తాం. అంతవరకు తెలుగుదేశం సభ్యులు ఓపిక పట్టాలనీ జైట్లీ చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ప్రధాని ఏపి సమస్యపై దృష్టి పెట్టారని కూడా జైట్లీ ముఖ్యమంత్రితో చెప్పారని అంటున్నారు. ఏపి ప్రత్యేక హోదా ఇస్తే కలిగేంత ప్రయోజనం ఇతరత్రా కలిగిస్తామని జైట్లీ ఆయనతో చెప్పారని అంటున్నారు.

పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టిడిపి పార్లమెంట్ సభ్యులు