జాతీయ వార్తలు

లోటు భర్తీ చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 2: 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొనలేదని కేంద్ర ఆర్థికశాఖ సహయమంత్రి అర్జున్ సింగ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీకి టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజి వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పుర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి కేంద్రం తగిన విధంగా నిధులు కేటాయించాలని చట్టంలో 46(2) పేర్కొందని తెలిపారు. ఇప్పటి వరకు 2014-15 సంవత్సరంలో వనరులు పూడ్చడానికి 2014-15 సంవత్సరానికి రూ.2304 కోట్ల ప్రత్యేక సహాయం చేశామని చెప్పారు. ఏపీ,తెలంగాణ అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం 2014-15లో ఏపీకి రూ 13775.76 కోట్లు రెవెన్యూ లోటును ఏర్పాడిందని చెప్పారు. 2015-16 ఏడాది రూ.500 కోట్ల ఇప్పటి వరకు ఇచ్చామని పేర్కొన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞత్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వివిధ నిబంధనల ప్రకారం ఏపీకి ప్రత్యేక సహాయం రూ.6403 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.