జాతీయ వార్తలు

గుజరాత్ పరిస్థితులకు మోదీయే కారణం: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గుజరాత్‌లో నెలకొన్న పరిస్థితులకు ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ను బలిపశువును చేసినా ఆ రాష్ట్రంలో బిజెపిని ఎవరూ కాపాడలేరని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు పదమూడేళ్ల మోదీ పాలనే కారణమని, ఆనందిబెన్ పాలన ఎంతమాత్రం కాదని రాహుల్ తన ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. యువ నాయకత్వానికి మార్గం సుగమం చేస్తూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆనంది బెన్ ప్రకటించిన విషయం విదితమే. వచ్చే ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులు వంటి ఘటన బిజెపిని ఇరకాటంలో పడేయడంతోపాటు, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఆనందిబెన్ రాజీనామా ఇప్పటికే ఆలస్యమయిందని, రాష్ట్రంలో పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దకుండా, ఆనందిబెన్‌ను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.