జాతీయ వార్తలు

గాంధీ బొమ్మ మారదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీని తొలగించి ఇతర నేతల చిత్రాలను ముద్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూపిఏ హయాంలో ఉన్నతస్థాయి కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఓ ప్రశ్నకు జవాబిస్తూ, ‘యుపిఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఓ కమిటీ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించరాదని నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ, ప్రభుత్వం కరెన్సీ చలామణిపై ఎప్పటికప్పుడు ఆర్బీఐతో సంప్రతింపులు జరపాలని నిర్ణయించిందని అన్నారు. పది రూపాయల కాయిన్‌కున్న డిమాండ్ దృష్ట్యా మరిన్ని కాయిన్లను విడుదలకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.